సంచలన దర్శకుడు రాం గోపాల్ వర్మ ఎవరికీ తెలీకుండా మరుగున పడిపోయిన వాస్తవాలను తెరపైకి తీసుకురావడంలో తన పద్దతే వేరు. దీనికి  ఎంతో సాహసం కావాలి. ఎన్నో వివాదాలను ఎదుర్కోవాలి. అయితే అలాంటి సాహసం చేశాడు, వివాదాలను ఎదుర్కోవడానికి అన్నీ విధాల సిద్దమయ్యాడు ఈశ్వర్ బాబు. మహాత్మ గాంధీజీ ని చంపినది ఎవరు?  హిస్టరీలో గాంధీజీని వ్యతిరేకించినది ఎవరు?  ఆ ఇద్దరి కోణంలో గాంధీని చూసుకునే వీలుందా? అది కూడా పెద్ద తెరపైన!! ఇప్పటివరకూ  గాంధీ జీవితాన్ని  గాడ్సే.. జిన్నా కోణంలో ఎవరూ సినిమా తీయలేదు.


అయితే ఈసారి ఆ విషయాలన్నీ చూపించేందుకు మహాత్మ గాంధీ జీవితకథను తెరపైకి తీసుకురాబోతున్నారు. అది కూడా మహాత్మాగాంధీ హత్యకు గురి కావడానికి 45 రోజుల ముందు నుంచి
హత్య తదనంతర పరిణామాల నేపథ్యంలో ఈ సినిమా రూపొందనుందని.. వివాదాలకు తావులేని రీతిలో మరుగున పడిపోయిన వాస్తవాలు వెలికి తీయడమే లక్ష్యంగా సినిమా తీస్తున్నామని చెబుతున్నారు ఈ బయోపిక్ మేకర్స్.


'సత్యమేవ జయతే-1948' పేరుతో ఎం.వై.ఎం. క్రియేషన్స్ పతాకంపై ఈశ్వర్ బాబు.డి దర్శకత్వంలో ఎం.వై.మహర్షి ఈ సినిమాని నిర్మిస్తున్నారు. అన్ని భారతీయ-అంతర్జాతీయ భాషల్లో రూపొందనున్న ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్ లో  ప్రారంభమైంది. మరి ఈ సినిమా ద్వారా ఎన్ని వాస్తవ సంఘటనలు తెరపై కనిపిస్తాయో తెలియాలంటే ఈ సినిమా రిలీజయ్యే వరకు వేచి చూడాలి.


మరింత సమాచారం తెలుసుకోండి: