డైరెక్టర్ రాజమౌళి తెరకెక్కిస్తున్న కొత్త సినిమా “ ఆర్ఆర్ఆర్” ఈ సినిమా కోసం వర్క్ మొదలైన దగ్గర నుండి ఏదో ఒక విశేషం తో వైరల్ అవుతుంది. మరి రాజమౌళి సినిమా అంటే ఆ మాత్రం హైప్ ఉండనేఉంటుంది. బాహుబలి లాంటి అంతర్జాతీయ గుర్తింపు పొందిన సినిమాను తెలుగు ఇండస్ట్రీ కి ఇచ్చిన తరువాత అతని రేంజ్ ఏక్కడికో వెళ్ళిపోయింది.

 

 ఏందరో బాలీవుడ్ , హాలీవుడ్ ప్రముఖులు తమ ఇండస్ట్రీ లో పని చేయమని అడిగినా, తెలుగు మీద ఉన్న మమకారం తో కొత్త కధ కధనం తో మనముందుకు ఒక పెద్ద మల్టీ స్టారర్ తీసుకుని రాబోతున్నారు రాజమౌళి. అందుకే అయన సినిమాలకు అంత క్రేజ్.

 

“ ఆర్ఆర్ఆర్” సినిమా లో నటించడం కోసం చాల మంది అగ్ర తరాలు పోటి పడ్డారు. లీడ్ రోల్ లో జూనియర్ ఎన్టిఆర్, రామ చరణ్ తేజ్ ఉన్నా మన బాహుబలి లాంటి రాజమౌళి దర్శకత్వం లో పనిచేయడమే అదృష్టం అని భావించి సైడ్ రోల్ లో కూడా పోటిపడుతున్నారు. ఇదిలా ఉండగా తారక్ కు షూటింగ్ లో గాయం కావడం తో ఒక వరం షెడ్యూల్ వాయిదా పడినా సరే మన రాజమౌళి మిగితా నటుల షాట్స్ ను కవర్ చేశారట. ఇదేనేమో సమయపాలన అంటే.

 

ఈ సినిమా కోసం బాలీవుడ్ అగ్ర తార అలియా భట్ కూడా ఆసక్తి చూపి మన డైరెక్టర్ దగ్గర ఛాన్స్ కొట్టేసింది. ప్రతీ పాత్ర కుడా చాల విశేషంగా ఆకట్టుకోనుంది అని అర్ధమవతుంది. ఈ సినిమా మీద ప్రేక్షకులకు భారి అంచనాలే ఉన్నాయి. ఇదిల ఉండగా చిత్రం మొదలైన దగ్గర నుండి దీని టైటిల్ “ ఆర్ఆర్ఆర్” గానే ఉండిపోయింది. కానీ రాజమౌళి మాత్రం ఈ సినిమా టైటిల్ ను పెట్టె భాద్యత ప్రేక్షకులకే వదిలేశారు. ఏక్కువ శాతం ‘రామ రావణ రాజ్యం ‘, రఘుపతి రాఘవ రాజారామ్’ అని సూచించారు. అయితే ఇంకా టైటిల్ ఫైనల్ కాలేదు.

 

 


మరింత సమాచారం తెలుసుకోండి: