'సాహో'..... 300 కోట్ల బడ్జెట్, పాన్ ఇండియా స్టార్ గా ఎదిగిన హీరో 'ప్రభాస్', అందాల భామ 'శ్రద్ధ కపూర్', విదేశాలనుంచి VFX , స్టంట్ టీములు....వెరసి, భారతదేశంలో కానీ విని ఎరుగని స్థాయిలో, హాలీవుడ్ యాక్షన్ సినిమాలకి సైతం తీసిపోని గ్రాండ్ స్కేల్ తో ఫస్ట్ లుక్ దేగ్గర్నుంచి, మేకింగ్ వీడియో ల దాక ప్రభంజనం సృష్టిస్తున్న సహో సినిమా ఒక డిజాస్టర్ అని ఒక హిందీ ఫిలిం చ్రితిచ్ తేల్చేసాడు.


వివరాలలోకి వెళితే, కమాల్ ఆర్ ఖాన్, షార్ట్ గా KRK అని పిలవబడే ఒక మహానుభావుడు "సాహో సినిమా ట్-సిరీస్ చరిత్ర లోనే ఒక పెద్ద డిజాస్టర్ అవుతుంది, ఎందుకంటే దాని బడ్జెట్ 250 కోట్లు" అని తన కొత్త ట్విట్టర్ అకౌంట్ నుంచి ట్వీట్ చేసాడు. ఈ మహాశయుడిని ట్విట్టర్ నుంచి కొన్నాళ్ళు బ్యాన్ చేసారు, ఇతడి చెత్త వాగుడితో బాలీవుడ్ ప్రముఖులమీద సెటైర్లు వేస్తున్నాడని...ఇంకా చెప్పాలంటే అతగాడు బాలీవుడ్ 'కత్తి మహేష్' అన్నమాట.


కానీ ఆ మహాశయుడికి తెలియనిది ఏమిటంటే, 250 కోట్లు పెట్టి, ఇండియా మొత్తం రిలీజ్ చెయ్యబోతున్న సినిమా, ఇప్పటికే ప్రీ రిలీజ్ బిజినెస్ 1000 కోట్లు దాటేసింది అని......అయ్యా బాలీవుడ్ కత్తి మహేశా....చాలు నీ విశ్లేషణలు.



మరింత సమాచారం తెలుసుకోండి: