పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సరసన 'తీన్ మార్' చిత్రంలో నటించింది కృతి కర్భంద. ఈ సినిమాతోనే టాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీకి పరిచయమైంది. జయంత్.సి.ఫరాన్జీ దర్శకత్వం వహించిన ఈ సినిమా డిజాస్టర్‌గా మిగిలింది. ఆ తర్వతా కృతి సుమంత్.. కళ్యాణ్ రామ్ లాంటి స్టార్ల సరసన నటించింది. అయినా టాలీవుడ్ లో ఆశించిన స్టార్ డమ్ ని సంపాదించుకోలేకపోయింది. మెగా పవర్‌ స్టార్ రాం చరణ్ 'బ్రూస్ లీ' సినిమాలో లో సిస్టర్ పాత్రలో నటించినా అదీ కెరీర్ కి ఏమాత్రం కలిసి రాలేదు. 


కానీ ప్రస్తుతం కృతి బాలీవుడ్ సహా తమిళం.. కన్నడలో బిజీ బిజీ. హిందీ పరిశ్రమలో క్రేజీ ప్రాజెక్ట్స్ లో నటిస్తూ క్షణం తీరిక లేనంత బిజీగా ఉంది. అంతేకాదు కృతి నటించిన భారీ మల్టీస్టారర్ హౌస్ ఫుల్ 4 త్వరలోనే రిలీజ్ కి రెడీ అవుతోంది. బాలీవుడ్ లోనే పాగల్ పానీ.. చెహ్రే లాంటి క్రేజీ చిత్రాల్లో నటిస్తోంది. అనీల్ కపూర్- జాన్ అబ్రహాం- అర్షద్ వార్షీ లాంటి స్టార్లతో కలిసి పాగల్ పానీ లాంటి భారీ సినిమాలో నటిస్తూనే తమిళంలో వాన్ అనే సినిమాలోనూ నటిస్తూ బిజీగా ఉంది. దుల్కార్ సల్మాన్ - కళ్యాణి ప్రియదర్శిని ఈ సినిమాలో హీరో,హీరోయిన్స్‌గా నటిస్తున్నారు. ఇదే సినిమాలో కృతి ఓ కీ రోల్ పోషించనుందట.


ఇంత బిజీగా ఉంటూనే కంటిన్యూస్‌గా ఫోటోషూట్లతోనూ సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తూ ఫ్యాన్స్ ను ఆకట్టుకుంటోంది. మొత్తానికి టాలీవుడ్ లో పాపులారిటీ తెచ్చుకోలేకపోయినప్పటికి బాలీవుడ్ కోలీవుడ్ లో స్టార్ హోదాను సంపాదించుకోవడం గ్రేటేనని చెప్పాలి.



మరింత సమాచారం తెలుసుకోండి: