దేవీ లాంటి డివోషనల్, ఫాంటసీ సినిమాకు సంగీతం అందించి మొదటి సినిమాతోనే దుమ్మురేపాడు.  ఆ తర్వాత వచ్చిన ఆనందం సినిమా పాటలు ఇప్పటికీ వినసొంపుగానే ఉంటాయి.  రాప్ మ్యూజిక్ కి మాస్ ఎలిమెంట్స్ కలగలిపి రాక్ అండ్ రోల్ అనిపించేలా సంగీతం అందించి అన్ని వర్గాల వారి మన్ననలు పొందారు దేవీ శ్రీ ప్రసాద్.  ఒకదశలో దేవీ శ్రీ మ్యూజిక్ అంటే ఆ సినిమా సూపర్  హిట్ టాక్ అనే అనేవారు. అప్పట్లో మెగా హీరోలు తమ సినిమాలకు దేవీ మ్యూజిక్ తప్పకుండా ఉండాలని పట్టుపట్టిన సందర్బాలు కూడా ఉన్నాయంటే అతిశయోక్తి లేదు.


అలాంటి దేవీ శ్రీ ప్రసాద్ ఈ మద్య ఎన్నో విమర్శల పాలవుతున్నారు.  ఆయన సంగీతం ఆడియాన్స్ ని ఏమాత్రం ఆకర్శించలేక పోతున్నాయని..అప్పటి ఫాస్ట్ బీట్ లేదని.. ఏదో సినిమాకు సంగీతం ఇచ్చి మమా అనిపించుకుంటున్నారని టాప్ హీరోల ఫ్యాన్స్ విమర్శిస్తున్నారు. ఈ మధ్య కాలంలో వచ్చిన 'వినయ విధేయ రామా' సినిమాకి .. ఇటీవల వచ్చిన 'మహర్షి' సినిమాకి స్వరపరిచిన బాణీల్లో అంతగా పసలేదనే విమర్శలు వినిపించాయి.


ఈ విషయం గత కొంత కాలంగా సోషల్ మీడియాలో బాగా ట్రోల్ కావడంతో దేవిశ్రీ ప్రసాద్ ఆలోచనలో పడినట్టుగా చెప్పుకున్నారు. ఎక్కువ ప్రాజెక్టులు ఒప్పుకోవడం వలన, హీరోల సినిమాల నుంచి అభిమానులు ఆశించే సంగీతాన్ని అందించలేకపోతున్నానని దేవిశ్రీ ప్రసాద్ భావించాడట. ఇలా అయితే తన ఫ్యూచర్ దెబ్బతింటుందని భావించారో ఏమో కానీ..ఓ సంచలన నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.  ఇకపై తాను సంవత్సరానికి ఒకటీ రెండు సినిమాకన్నా ఎక్కువ ఒప్పుకోబోనని..తన సంగీతంలో నూతన ఒరవడిని తీసుకు వస్తానని అన్నారట.  ఇక పై స్టార్ హీరోల సినిమాలను మాత్రమే చేస్తాడేమోననే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. 




మరింత సమాచారం తెలుసుకోండి: