టాలీవుడ్, బాలీవుడ్, కోలీవుడ్...ఇలా ఏ ఫిల్మ్ ఇండస్ట్రీలోనైనా ఒక భాషలో తీసిన సినిమా తాలూకు మసాలాలు ఇంకో సినిమాలో కనిపించడం సర్వసాధారణం. దాదాపు అన్నీ భాషల్లోను ఇదే జరుగుతుందన్న విషయం సినీ విశ్లేషకులకు తెలిసిందే. అంతేకాదు సినీ పరిశ్రమలోనూ చాలామంది పసిగట్టే విషయమే. అయితే ఈ మధ్య కాలంలో కొంతవరకు ఒరిజినల్ కంటెంట్ ఉన్న సినిమాలు పరిశ్రమకు జీవం పోస్తున్నాయి. శివ నిర్వాణ- మజిలీ.. గౌతమ్ తిన్ననూరి - జెర్సీ  సినిమాలు అందుకు ఎగ్జాంపుల్. ఒక దర్శకరచయిత తనకు తానుగా సృజించే ఒరిజినల్ కథ- స్క్రిప్టుతో సినిమా తీస్తే అందులో ఉండే అన్నీ ఎమోషన్స్‌ను ఆడియెన్స్ బాగా రిసీవ్ చేసుకుంటారు.


అలా కాకుండా అప్పటికే ఇతర భాషలో వచ్చేసిన ఏదైనా సినిమా స్ఫూర్తితో లేదా ఆ సినిమాలో ఏదైనా క్యారెక్టర్ స్ఫూర్తితో సినిమా తీస్తే ప్రేక్షకులు వందశాతం కనెక్ట్ అవడం చాలా కష్టం. ఎందుకంటే గత సినిమా కథ కథనాలు ఈ సినిమాలోను చూసినవే కదా అని ఫీలవుతారు. మన దర్శకనిర్మాతలు ఎక్కువగా చెప్పే మాట కథలు దొరకడం లేదన్నది. అందుకే ఇరుగు పొరుగున హిట్టయిన సినిమా కథల్ని కొనుక్కోవడం.. వాటి రీమేక్ హక్కుల్ని ఛేజిక్కించుకోవడం చేస్తున్నారు. అలా కాకుండా కొందరు హాలీవుడ్ సినిమాల్ని చూసి వాటి నుంచి స్ఫూర్తిగా తీసుకుని కథలు రాయడం చేస్తున్నారు.


రీసెంట్‌గా వచ్చిన 'సీత' కూడా ఓ హాలీవుడ్ సినిమా కి ఇన్స్పిరేషన్ అన్న మాట గట్టిగా వినిపిస్తోంది. 1988 లో హాలీవుడ్ ఫేమస్ డైరెక్టర్ బ్యారీ లెవిన్సన్ తెరకెక్కించిన అమెరికన్ డ్రామా 'రెయిన్ మ్యాన్' ఆధారంగా బెల్లంకొండ శ్రీనివాస్ పాత్రను డిజైన్ చేశారని సినిమా చూసిన ప్రేక్షకుల అభిప్రాయం. ఆ సినిమాలో దస్తిన్ హాఫ్ మేన్ రోల్ తో 'సీత' సినిమాలో బెల్లంకొండ శ్రీనివాస్ రోల్ పోలిక ఉందని విశ్లేషిస్తున్నారు. తేజ నిజంగానే ఆ సినిమా నుంచి స్ఫూర్తి పొందారా?  లేక ఒరిజినల్ థాట్ ప్రాసెస్ లో ఈ పాత్రను క్రియేట్ చేశారా? అన్న వాస్తవం మాత్రం దర్శకుడుకే తెలియాలి.



మరింత సమాచారం తెలుసుకోండి: