చిత్రం-నువ్వు నేను-జయం వంటి లవ్ స్టోరీస్ తో తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ ని ఏర్పరుచుకుని ఏకంగా మహేష్ బాబుతో 'నిజం' సినిమా చేసే స్థాయికి కు చేరుకున్న దర్శకుడు తేజ ఆ తర్వాత తన మేజిక్ కోల్పోయి వరుస ఫ్లాప్స్ కి పరిమితమైపోయాడు. కొన్నేళ్ల పాటు వరుస పరాజయాలు వెంటాడుతూనే వచ్చాయి. ఈ విషయంలో గురువు వర్మనే ఫాలో అవుతున్నాడంటూ గట్టి కామెంట్స్ కూడా వినిపించాయి. అయితే రెండేళ్ల క్రితం రానా దగ్గుబాటితో తీసిన 'నేనే రాజు నేనే మంత్రి' హిట్ అవడంతో తేజ కం బ్యాక్ అని అందరు అనుకున్నారు. ఇక యూత్ అయితే మళ్ళీ మాంచి లవ్ స్టోరీతో ఫుల్ ఫాం లోకి వచ్చేస్తారనుకున్నారు. 


అందుకే వరుస ఫ్లాప్ లతో ఉన్న హీరోమీద కాకుండా తేజ బ్రాండ్ మీద కాజల్ అగర్వాల్ ఇమేజ్ మీదే సీత ఎక్కువ ప్రమోట్ అయ్యి థియేటర్లలోకి వచ్చేసింది. అయితే ఆశించిన విధంగా ఏమంత పాజిటివ్ టాక్ తో సీత ఓపెన్ కాకపోవడం కొంత ఆందోళనకు గురి చేస్తోంది. హీరో పాత్రను తీర్చిదిద్దిన తీరు, సినిమా లెన్త్, మధ్యలో అర్థం పర్ధం లేకుండా వచ్చే పాటలు కనెక్ట్ అయ్యేలా లేకపోవడం ఇవన్నీ బాగానే ప్రభావం చూపిస్తున్నాయి. అందుకే సీత మీద పెట్టుకున్న అంచనాలలో సగమైనా అందుకుంటుందా అనే అనుమానం వస్తోంది. ఇదంతా పబ్లిక్ రెస్పాన్స్, వాళ్ళు చెబుతున్న అభిప్రాయాలు కూడా ఒక కారణం.


ఎక్కడ చూసినా రివ్యూస్ కూడా సీతకు ఫెవర్ గా లేవు. దీంతో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ కు మరో ఫ్లాప్ తప్పదని సోషల్ మీడియాలో కామెంట్స్ మొదలైపోయాయి. మొత్తానికి తేజ నుంచి చాలా ఆశిస్తే ఆయన మళ్ళీ మొదటికే వచ్చారని నేనే రాజు నేనే మంత్రి తరహా పనితనం సీతలో లేదని సోషల్మీడియాలో విశ్లేషిస్తున్నారు. ఇక సినిమా బిజినెస్ మొత్తం కాజల్ పెర్ఫార్మన్స్ సోను సూద్ విలన్  మీదే ఉంది. మరి అవి ఎంత వరకు వసూళ్లకు హెల్ప్ అవుతుందనేది చూడాలి.  



మరింత సమాచారం తెలుసుకోండి: