శర్వానంద్ కొత్త సినిమా రణరంగం ఫస్ట్ లుక్ అఫీషియల్ గా ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది. టైటిల్ కూడా ఫస్ట్ లుక్ తో పాటే అనౌన్స్ చేయడం అందరిని  ఆకట్టుకునే విషయం. ఇక టైటిల్ అండ్ ఫస్ట్ లుక్ అద్భుతంగా ఉన్నాయని ప్రేక్షకులు చెప్పుకుంటున్నారు. రఫ్ లుక్ తో ఏజ్డ్ పాత్రలో శర్వానంద్ ఎవరూ ఊహించని ట్విస్ట్ ఇవ్వడం బావుంది. ఈ లెక్కన శర్వానంద్ పాత్ర గ్యాంగ్ స్టర్ గా ఎదిగి తన జీవితంలోని కీలక దశలను ఎలా దాటాడు అనే దాని మీద రణరంగం ఉండబోతోందనే క్లారిటీ క్లియర్‌గా వచ్చేసింది.


 ప్రపంచ మాఫియా సినిమాలకు ఎవర్ గ్రీన్ రిఫరెన్స్ గా నిలిచే గాడ్ ఫాదర్ లుక్ ని తలపించేలా శర్వా కళ్ళలో, ఎక్స్ ప్రెషన్స్ లో అదే ఇంటెన్సిటీ చూపించడం మేయిన్ ప్లస్. ముఖ్యంగా ఎవరూ ఊహించని పాత్రలో శర్వానంద్ అభిమానులకు స్వీట్ షాక్ ఇవ్వబోతున్నాడని ఇండస్ట్రీ టాక్. అంతేకాదు ఈ సినిమాతో బాక్సాఫీస్ ని బద్దలు కొట్టడం ఖాయమని కూడా అభిప్రాయం వ్యక్తపరుస్తున్నారట.  


1990 ప్రాంతంలో వైజాగ్ లో మొదలైన రణరంగం విదేశాలకు వెళ్లి తన కనుసైగతో ప్రపంచ నేర సామ్రాజ్యాన్ని శాశించే స్థాయికి ఎలా తీసుకెళ్ళింది అనే ప్లాట్ మీద రణరంగం రూపుదిద్దుకున్నట్టుగా టాక్. సుదీర్ వర్మ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాని సితార బ్యానర్ నిర్మిస్తోంది. ఆగస్ట్ 2న  ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈసినిమాలో కాజల్ అగర్వాల్, కళ్యాణి ప్రియదర్శన్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు.



మరింత సమాచారం తెలుసుకోండి: