వైఎస్ జగన్. తక్కువ మాట్లాడుతారు. చెప్పింది చేస్తారు. ఇది ప్రజల నమ్మకం. అందుకే ఆయనకు భారీ మెజారిటీతో  పట్టం కట్టారు. విభజన ఏపీలో అన్ని వర్గాలూ జగన్ మీద కోటి ఆశలు పెట్టుకున్నాయి. అందులో సినిమా జనం కూడా ఉన్నారని అంటున్నారు. జగన్ తన తండ్రిలాగానే మాట మీద నిలబడే మనిషి అని, ఆయన చెబితే అది నూరు శాతం నెరవేరుస్తారని అంటున్నారు.



విభజన ఏపీలో అయిదేళ్ళ పాటు చంద్రబాబు పాలన చేశారు. ఆ సమయంలో సినిమా పరిశ్రమ కనీసంగా కూడా వెళ్ళూనుకోలేదు. ఎంతో మంది సినీ ప్రముఖులు బాబుకు, టీడీపీకి గట్టి మద్దతుదారులు. అయినా కూడా సినిమా రంగం మాత్రం ఏపీలో ఎదగలేదు.  పెరగలేదు. మరిపుడు ఆ పనిని కొత్త సీఎం జగన్ చేస్తారా. అంటే టాలీవుడ్ అవును అంటోంది. పైగా బాబు కంటే జగన్ చేయగలరని కూడా గట్టిగా నమ్ముతోంది.



విశాఖ కేంద్రంగా టాలీవుడ్ షిఫ్టింగుకు ఇపుడు అన్ని అవకాశాలు మెరుగుపడ్డాయని కూడా అంటున్నారు. ఇప్పటికే అక్కడ రామానాయుడు స్టూడియో ఉందని, దాంతో పాటు మరింతమందికి భూములు ఇస్తే విశాఖలో రెండవ టాలీవుడ్ ఏర్పాటు కావడం సులువేనని అంటున్నారు. మరి జగన్ ఆ దిశగా చర్యలు తీసుకుంటారని భావిస్తోంది. తొందరలోనే కొత్త సీఎం ని కలసి తమ సమస్యలు నివేధించాలని అనుకుంటోంది.


మరింత సమాచారం తెలుసుకోండి: