ఎనర్జిటిక్ స్టార్ రామ్ హీరోగా పూరి జగన్నాథ్ డైరక్షన్ లో వస్తున్న సినిమా ఇస్మార్ట్ శంకర్. ఈమధ్య రామ్ బర్త్ డే రోజు టీజర్ తో సర్ ప్రైజ్ ఇచ్చిన పూరి సినిమాను అనుకున్న టైంలోనే పూర్తి చేసి రిలీజ్ కు సిద్ధం చేశాడు. రామ్, పూరి మొదటిసారి కలిసి చేస్తున్న ఈ క్రేజీ కాంబినేషన్ సినిమా ఇస్మార్ట్ శంకర్.


రామ్ సరసన నిధి అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాను పూరి జగన్నాథ్ తో పాటుగా ఛార్మి కౌర్ కూడా నిర్మాణ భాగస్వామ్యం అవుతుంది. రిలీజైన టీజర్ కూడా సినిమా మీద అంచనాలు పెంచేసింది. రాం ఎప్పుడు చేయని రఫ్ క్యారక్టర్ లో కనిపిస్తున్నాడు. ఇక ఈ సినిమాను జూలై 12న రిలీజ్ ఫిక్స్ చేశారు.  


ఇస్మార్ట్ శంకర్ డబుల్ ధిమాక్ అంటూ దమ్ము చూపించేందుకు వస్తున్నాడు రామ్. వరుస ఫ్లాపులతో సతమతమవుతున్న పూరి ఈ సినిమాతో తన కసి చూపించబోతున్నాడని తెలుస్తుంది. నిధి అగర్వాల్ అందాలు కూడా సినిమాకు ప్లస్ అవుతాయని తెలుస్తుంది. సినిమాలో రామ్ లుక్ అతని ఫ్యాన్స్ కు కిక్ ఇస్తుంది.  


3 నెలల్లో సినిమా పూర్తి చేసే పూరి ఇస్మార్ట్ శంకర్ కు అంతే టైం తీసుకున్న ఈ సినిమాతో పక్కా హిట్ కొట్టేలా జాగ్రత్త వహించాడని తెలుస్తుంది. సినిమా టీజర్ తోనే తెలుస్తుంది కచ్చితంగా ఈసారి పూరి తన దమ్ము చూపిస్తాడని. రామ్ కూడా ఈ సినిమా మీద చాలా హోప్స్ పెట్టుకున్నాడు. మరి పూరి, రామ్ కాంబో ఎలా ఉంటుందో చూడాలి.     



మరింత సమాచారం తెలుసుకోండి: