టాలీవుడ్ లో వరుస విజయాలు ఇస్తూ హీరోలకు మంచి సక్సెస్ ఇస్తున్న యువ దర్శకుడు అనీల్ రావిపూడి , నందమూరి కళ్యాన్ రామ్ కి పటాస్,  సాయి ధరమ్ తేజ్ కి సుప్రీమ్, రెండేళ్ల తర్వాత రీ ఎంట్రీ ఇచ్చిన రవితేజకు ‘రాజా ది గ్రేట్’లాంటి బ్లాక్ బస్టర్స్ అందించారు.  ఈ సంవత్సరం సంక్రాంతి కానుకగా విక్టరీ వెంకటేష్, మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ మల్టీస్టారర్ మూవీ ‘ఎఫ్ 2’ గ్రాండ్ సక్సెస్ అయ్యింది.  దాంతో అనీల్ రావిపూడి తో సినిమాలు తీయడానికి నిర్మాతలు క్యూ కడుతున్నారు.  మరోవైపు స్టార్ హీరోలు సైతం ఈ దర్శకుడితో నటించడానికి ఉత్సాహం చూపిస్తున్నారు.


ఈ నేపథ్యంలో సూపర్ స్టార్ మహేష్ బాబు — అనీల్ రావిపూడి కాంబినేషన్ లో ఓ సినిమా రాబోతున్న విషయం తెలిసిందే.  ఈ నెల చివరన సూపర్ స్టార్ కృష్ణ పుట్టిన రోజు సందర్భంగా ఈ షూటింగ్ ప్రారంభం కాబోతుంది.  అంతా బాగుంది కానీ..ఇప్పుడు అనీల్ రావిపూడి ఓ ఆలోచనలో పడ్డట్టు సమాచారం.  అయితే మహర్షి మూవీకి ముందు సూపర్ స్టార్ తో పనిచేయబోతున్నాను అంటూ సంతోషంగా ఉండేవాడు కానీ ఎప్పుడైతే మహర్షి సినిమా ఆశించిన స్థాయిలో విజయం నమోదు చేయకపోవడంతో అనిల్ రావిపూడి కి భయం పట్టుకుంది .


మహర్షి తర్వాత అనిల్ రావిపూడి తో మహేష్ బాబు చేస్తున్న చిత్రం కావడంతో తప్పకుండా బ్లాక్ బస్టర్ కొట్టాల్సిందే.. లేదంటే ఈ హీరోకి, దర్శకుడికి ఎంతో ప్రెస్టేజెస్ క్వచ్చన్ గా తీసుకున్నట్లు తెలుస్తుంది.  ఒత్తిడి అధికం కావడంతో ఈ ప్రాజెక్ట్ ని సవాల్ గా తీసుకున్నాడట అనిల్ . యాక్షన్ కు వినోదాన్ని జతచేసి బ్లాక్ బస్టర్ కొట్టడం అనిల్ స్టైల్ . మరి ఈ సారి మహేష్ తో బ్లాక్ బస్టర్ కొడతాడా ? లేక ఒత్తిడికి లోనై తడబడతాడా ? చూడాలి .

మరింత సమాచారం తెలుసుకోండి: