సినిమా రంగంలో రాణించడం కోసం చాలామంది తమ పేర్లు మార్చుకున్నారు. ఇదే కోవలో తాజాగా అక్కినేని ఇంటిలో కోడలిగా అడుగుపెట్టిన సమంతా కూడా తన పేరు విషయమై ఇటీవల ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. నాగచైతన్యతో పెళ్లికాకముందు సమంత ప్ర‌భు గా వుండే పేరును సమంత అక్కినేని గా సోషల్ మీడియాలో మార్చేసింది. అయితే తాజాగా మరొకసారి సోషల్ మీడియాలో ఇప్పుడు తన పేరు మార్చుకుంది.


అయితే అప్పట్లో నాగచైతన్య పెళ్లి అయ్యాక మార్చుకుంటే ఇప్పుడు తాజాగా పేరు మార్చడానికి అవసరం ఒకసారి గమనిస్తే..బలమైన కారణమే ఉంది. అది మరోదో కాదు సమంత తాజా చిత్రం.. `ఓ బేబీ` చిత్రం.  ఈ చిత్రం లో సమంత పేరు బేబి. అలాగే సినిమా పేరు కూడా ఓ బేబి. దాంతో సినిమా ప్రమోషన్ కు కలిసొస్తుందని సమంత తెలివిగా ఇలా సోషల్ మీడియాతో తన పేరు మార్చుకుందన్నమాట.


ఇక ఇప్పటికే ఈ సినిమా టీజ‌ర్ విడుద‌లై మంచి రెస్పాన్స్‌ను రాబ‌ట్టుకుంది. త్వ‌ర‌లోనే ఈ సినిమా విడుద‌ల కానుంది. “నాతో ఎంజాయ్మెంట్ మామూలుగా ఉండదు ఒక్కొక్కరికి.. చూస్తారు గా” అంటోంది సమంత . కొరియన్ మూవీ మిస్ గ్రానీ ఆధారంగా నందిని రెడ్డి సమంతతో రూపొందించిన చిత్రం ఓ బేబీ. త్వరలో రిలీజ్ అవునన్నా ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలు తాజాగా మొదలయ్యాయి.



మరింత సమాచారం తెలుసుకోండి: