ప్రభాస్ ముందుకు వేయాలనుకున్న అడుగుకు దర్శకుడు రాజమౌళి బ్రేకులు వేసాడు. అడుగు వేసావో అంతే సంగతులు, నిండా మునుగుతావు అంటూ హెచ్చరించినంత పని చేసాడట. ఇప్పుడు రాజమౌళి అత్యంత ప్రతిష్టాత్మకంగా ప్రభాస్ తో ‘బాహుబలి’ సినిమాను తీస్తున్న సంగతి అందరికి తెలిసిందే.

ఈ సినిమా పూర్తికావడానికి ఏడాదో, ఏడాదిన్నరో పట్టే అవకాశాలున్నాయంటున్నారు.  ప్రభాస్ తన బాబాయ్ కృష్ణంరాజు తో ‘ఒక్క అడుగు’ సినిమా తీయడానికి ఒప్పుకున్న విషయం తెలిసిందే. బాహుబలి అయ్యాకే ఈ సినిమా ప్రారంభించి పూర్తి చేయాలనుకున్నాడు ప్రభాస్. కాని ఇది ఇప్పట్లో పూర్తయ్యేలా లేకపోవడంతో మనసు మార్చుకున్నాడట.

బాబాయి సినిమాను అక్టోబరులో మొదలు పెట్టి ఈ ఏడాది చివరికల్లా పూర్తి చేసి ‘ఒక్క అడుగు’ తెరపైకి వేయాలని చూసాడు. బాహుబలి షూటింగ్ విరామ సమయాల్లో ఈ సినిమా పూర్తిచేయాలని భావించాడట. అయితే రాజమౌళి ప్రభాస్ ను అలా చేస్తే బాగుండదు, బాహుబలి కి ఇప్పుడు వస్తున్న పేరుకు డ్యామేజి అవుతుంది, బాహుబలి పూర్తవుతుందో లేదో అన్న అనుమానాలతో పాటు, ఈ సినిమాపై అంత నమ్మకం లేకనే ప్రభాస్ మరో సినిమా మొదలుపెట్టుకున్నాడు అంటారు, కాబట్టి ‘ఒక్క అడుగు’ కూడా అటు వేయోద్దు అని చెప్పేసాడంటున్నారు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: