బిగ్ బాస్ సీజన్ 3 హడావిడి మొదలు కాబోతుంది.. ఓ పక్క వరల్డ్ కప్ సీజన్ స్టార్ట్ అవుతున్న ఈ తరుణంలో అది పూర్తి కాగానే స్టార్ మా బిగ్ బాస్ మొదలు పెడతారని తెలుస్తుంది. మొదటి రెండు సీజన్లు సక్సెస్ ఫుల్ కాగా మూడవ సీజన్ మరింత అంచనాలతో రాబోతుంది. ఈ సీజన్ కు నాగార్జున హోస్ట్ గా చేస్తున్నాడన్న విషయం తెలిసిందే.


మొదటి సీజన్ ఎన్.టి.ఆర్ క్రేజ్ మీద హిట్ అయిన బిగ్ బాస్ సెకండ్ సీజన్ లో హోస్ట్ నాని కన్నా కంటెస్టంట్స్ వల్లే బాగా క్లిక్ అయ్యింది. ముఖ్యంగా కౌశల్ మందా చేసినా హడావిడి అంతా ఇంతా కాదు. ఒకానొక దశలో నాని కన్నా కౌశల్ కే ఎక్కువ ఫాలోయింగ్ ఏర్పడిందన్న ప్రస్థావన కూడా వచ్చింది. 


ఇదిలాఉంటే ఈసారి సీజన్ కు అలాంటి సంఘటనలు జరుగకుండా జాగ్రత్త పడుతున్నారు. హోస్ట్ నాగార్జున కాబట్టి పెద్దగా ప్రభావం పడకపోవచ్చు. షో నడవాలంటే హౌజ్ లో గొడవలు ఉండాల్సిందే. అప్పుడే ఆడియెన్స్ కు కిక్ వస్తుంది. అందుకే స్మాల్ స్క్రీన్ క్రేజీ కపుల్స్ ను తీసుకుంటున్నారట. బిగ్ బాస్ 3లో ఉదయభాను, జ్వాలా గుత్తా, సుధీర్, రష్మి ఇలాంటి వాళ్లను బిగ్ బాస్ కంటెస్టంట్స్ గా తీసుకోబోతున్నారట.


సుధీర్ రష్మిలకు ఫాలోయింగ్ బాగా ఉంది. వారిద్దరు ఉంటే షో కూడా సక్సెస్ అవుతుందని బిగ్ బాస్ నిర్వాహకులు అనుకుంటున్నారట. అయితే షోలో గొడవపడే సుధీర్ రష్మి బిగ్ బాస్ హౌజ్ లో రియల్ ఫైట్ కు సిద్ధమవుతారా లేదా అన్నది తెలియాల్సి ఉంది. ఏది ఏమైనా షో సక్సెస్ కోసం న్యూసెన్స్ కే బిగ్ బాస్ టీం ఎక్కువ ఇంపార్టెంట్ ఇస్తుంది. సీజన్ 2 విషయంలో అన్ని ముందే తెలిసిపోగా సీజన్ 3 అయినా ఎక్సైటింగ్ కలుగ చేస్తుందో లేదో చూడాలి.



మరింత సమాచారం తెలుసుకోండి: