మెగాస్టార్ చిరంజీవి  తనయుడు రాంచరణ్ మొదటి సినిమా ‘చిరుత’తో తెలుగు తెరకు పరిచయం అయ్యింది బాలీవుడ్ బ్యూటీ నేహ శర్మ. తెలుగులో నటించింది ఒక్క మూవీ అయినా  నేహా శర్మ చేసిన రచ్చ అంతా ఇంతా కాదు.  పొగరుబోతు అమ్మాయిగా..గ్లామర్ పాత్రలో నటించిన నేహా శర్మకు ఇక వరుసగా ఛాన్సులు వస్తాయని భావించారు అంతా.  కానీ చిరుత సినిమా తర్వాత ఒక్క తెలుగు మూవీలో కూడా నటించలేదు. 

ఇక లాభం లేదనుకొని బాలీవుడ్ లో ఛాన్సుల కోసం ప్రయత్నించినా అక్కడ కూడా పెద్దగా వర్క్ ఔట్ కాలేదు.  బాలీవుడ్ కు వెళ్లిన నేహా అక్కడ హాట్ గా ఉన్న ఫోటోషూట్స్ తో దుమ్మురేపుతోంది. నేహా అందాల ఆరబోత చూస్తే ఈ వయ్యారి భామకు సినిమాలో ఛాన్సులు వస్తాయని భావించినా..లాభం లేక పోయింది.  అయితే బాలీవుడ్ లో కొన్ని చిన్న చిత్రాల్లో నేహా శర్మ నటించింది. అవేవి ఈ హాట్ బ్యూటీకి పెద్దగా గుర్తింపు తీసుకురాలేదు. 

దాంతో   దర్శక, నిర్మాతలను ఆకర్షించేందుకు సోషల్ మీడియా వేదికగా చేసుకొని బికినీ ఫోటోస్ కూడా రెచ్చిపోయింది.  ప్రస్తుతం ఇలా హాట్ ఫోటో షూట్స్ చేస్తూ దర్శక నిర్మాతలని ఆకట్టుకునే ప్రయత్నం చేస్తోంది. మరి ఈ అందాల భామకు ఇప్పటికైనా సినిమా ఛాన్సులు వస్తాయో రావో తెలియదు. 



మరింత సమాచారం తెలుసుకోండి: