బాలీవుడ్ నటి విద్యాబాలన్ కన్నీరు పెట్టుకుంది..ఎందుకో తెలుసా తన శరీరంపై చాలా మంది వ్యంగంగా కామెంట్ చేస్తున్నారని..అంతే కాదు తనలా లావు ఉన్న వారిని కూడా చిన్న చూపు చూస్తున్నారని.  అయితే కొంత మంది శరీరతత్వం అలా ఉంటుందని..లావున్నానని వెక్కిరించొద్దంటూ కన్నీళ్లు పెట్టుకుంది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.  కేవలం నటి విద్యాబాలన్ ఒక్కరే కాదు చిత్ర పరిశ్రమలో చాలా మంది ఇలాంటి ఇబ్బందులతోనే బాధపడుతున్నారు. 

కెరీర్ బిగినింగ్ లో నాజూగ్గా..స్లిమ్ గా ఉన్నవారు కొంత కాలానికే బరువెక్కిపోవడం..లావు కావడం జరుగుతుంది..దాంతో సినిమా ఛాన్సులు కూడా పోగొట్టుకుంటున్నారు.  బాడీ షేమింగ్ విషయంలో కొందరు నటీమణులు ఎన్నో అవమానాలను ఎదుర్కొన్నారు.  ఈ వరుసలో ఇప్పుడు విద్యాబాలన్ కూడా ఒకరు. లావుగా ఉన్న కారణంగా తన శరీరాన్ని అసహ్యించుకునేదాన్ని అంటూ ఆమె చాలాసార్లు చెప్పింది.  అయితే తనలా అవమానాలు ఎదుర్కొంటున్న వారిలో స్ఫూర్తి నింపడానికి విద్యాబాలన్.. రేడియో స్టేషన్ బిగ్ ఎఫ్ ఎంతో కలిసి ఓ కార్యక్రమాన్ని నిర్వహించబోతున్నారు.

ఈ కార్యక్రమం పేరు 'ధున్ బదల్ కే దేఖో'. ఈ నేపధ్యంలో బిగ్ ఎఫ్ ఎం విద్యతో కలిసి ఓ వీడియోను రూపొందించింది.  ఈ పాట పాడుతూ..విద్యాబాలన్ వెక్కి వెక్కి ఏడుస్తుంది.  ఆ పాట వింటున్న ప్రతి ఒక్కరి హృదయాలు కూడా బాధపడుతున్నాయి. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. తమ జీవితంలో బాడీ షేమింగ్ ఘటనలు ఎదుర్కొన్న యువతీయువకులు ఈ కార్యక్రమం ద్వారా తమ సమస్యలు చెప్పుకునే అవకాశం ఉంటుంది. 


మరింత సమాచారం తెలుసుకోండి: