సౌత్ ఇండస్ట్రీలో తనకంటూ క్రేజ్ ఏర్పరుచుకుని బాలీవుడ్ ఇండస్ట్రీలో కూడా అడపాదడపా హిట్లు కొట్టిన కాజల్ అగర్వాల్ తాజాగా సౌత్ ఇండస్ట్రీ పై ఎక్కువ ఫోకస్ పెట్టింది. ఈ క్రమంలో తాజాగా తనని వెండితెరకు పరిచయం చేసిన డైరెక్టర్ తేజ దర్శకత్వంలో సీతా సినిమా చేయడం జరిగింది. ఈమధ్యే విడుదలైన ఈ సినిమా దారుణంగా ఫ్లాప్ అవడంతో కొంత నిరుత్సాహానికి గురైన కాజల్ అగర్వాల్ కొత్త ఛాలెంజ్ సవాలు విసురుతోంది. ఇంతకీ అసలు విషయంలోకి వెళితే ప్రస్తుతం సోషల్ మీడియాలో మరియు సెలబ్రిటీలలో ఫిట్ నెస్ ఛాలెంజ్ అనే ట్రెండ్ వైరల్ అవుతుంది.


ఈ సందర్భంగా హీరోయిన్ కాజల్ అగర్వాల్ వంద రోజుల్లో ఫిట్‌గా మారిపోవాలని కాజల్‌ నిశ్చయించుకున్నారు. అందుకే ఈ చాలెంజ్‌ కూడా టేకప్‌ చేశారు. ఈ విషయాన్ని ఇనిస్ట్రగ్రమ్ ద్వారా తన అభిమానులకు తెలియచేసారు. కాజల్‌ మాట్లాడుతూ – ‘‘యాక్టర్సే కాదు అందరూ ఫిట్‌గా ఉండాలి. నా శరీరాన్ని నేను అద్భుతంగా తయారు చేసుకోవాలనుకుంటున్నాను.


అందులో భాగంగా ఈ చాలెంజ్‌ తీసుకుంటున్నాను. నా కోచ్‌ శ్రీరామ్‌ పర్యవేక్షణలో దీన్ని మొదలుపెడుతున్నాను.ఏం తినాలి? ఏ ఎక్సర్‌సైజ్‌లు చేయాలి? అనేవి చాలా శ్రమతో కూడుకున్న పనులు. వాటిని కూడా చాలా తేలిక చేస్తున్నారు ఆయన. ఈ చాలెంజ్‌లో అసహజత్వానికి చోటే లేదు. కేవలం న్యాచురల్‌గా లభించే న్యూట్రిషన్స్‌తోనే ఈ చాలెంజ్‌లో పాల్గొంటున్నాను. ఎలాంటి మార్పు కనిపిస్తుందో వంద రోజుల్లో చూద్దాం’’ అని పేర్కొన్నారు.



మరింత సమాచారం తెలుసుకోండి: