అందాల హీరోయిన్ సమంత తాజాగా పవన్ కళ్యాణ్ ను పిచ్చిపిచ్చిగా ప్రేమిస్తోంది, అది ఎంత అంటే... పవన్ తో మరో సినిమా ఎంత తొందరగా చేస్తానా.. అంటూ ఉవ్వీల్లూరేంత. పవన్ కళ్యాణ్ ‘అత్తారింటికి దారేది’ లో మరదలు సమంతను తనంటే ఎంత ఇష్టపడేలా చేసుకున్నాడో చెప్పడానికి  ఇది చాలు అంటున్నారు టాలీవుడ్ లో.

సమంతకు ఇదేమన్నా మొదటి సినిమానా, ఫస్ట్ హిట్టా, ఒక్కడే హీరోనా, అంటే కాదు ఆమె ఇప్పటి వరకు ఏంమాయ చేసావే, బృందావనం, దూకుడు, ఈగ, సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు వంటి సినిమాలు చేసింది. అన్ని హిట్లే, అన్నింటిలో కలిపి టాలీవుడ్ లోని స్టార్ హీరోలందరితో నటించింది.

కాని ఎవరి మీద పారేసుకోని మనసు పవన్ పై పారేసుకుంది. తనకు ఈ సినిమాలో శశి పాత్ర బాగా నచ్చిందట, ఇలాంటి కామెడి పాత్ర ఇంతకు ముందెప్పుడు చేయలేదట. అందుకే పవన్ తో మరో సినిమా తీసి మరెంతో అనుభూతి పొందాలని సమంత ఉవ్విల్లూరుతోందట.

 

మరింత సమాచారం తెలుసుకోండి: