2019 సంక్రాంతి బరిలో రజనీకాంత్ - బాలకృష్ణ- రామ్ చరణ్ - వెంకటేష్ -వరుణ్ తేజ్ లాంటి హీరోలు పోటీపడ్డారు. ఈ పోటీలో వెంకీ- వరుణ్ జోడీ విజేతలుగా నిలిచి మిగత హీరోలకు చెక్ పెట్టారు. సైలెంట్ గా ఎఫ్ 2-ఫన్ అండ్ ఫ్రస్టేషన్ బ్లాక్ బస్టర్ హిట్ కొట్టింది. ఒకరకంగా చెప్పాలంటే 2019 సంక్రాంతి కి రిలీజైన సినిమాలలో 100 కోట్లు కలెక్ట్ చేసిన సినిమా ఎఫ్ 2- మాత్రమే. ఇక 2020 సంక్రాంతి కి పోటీ పడే సినిమాలేవి. అంటే చాలానే క్యూ లో ఉన్నాయి.  సమ్మర్ దాటుకుని వర్షాకాలంలో అడుగుపెట్టేయబోతున్నాం. 2019 ద్వితీయార్థంలో అడుగు పెట్టడానికి టైం దగ్గర పడింది. 


కాబట్టి ఇప్పటికే కొంతమంది దర్శక నిర్మాతలు అండర్ ప్రొడక్షన్ ఉండగానే సంక్రాంతి రిలీజ్ లను ఫిక్స్ చేసుకున్నారు. క్లీన్ గా సంక్రాంతి 2020 కి రిలీజ్ చేస్తున్నాం అంటూ అధికారికంగా పోస్టర్లలోనూ వేసేస్తుండంతో ఒక్కసారిగా సంక్రాంతి  పోటీ అప్పుడే మొదలైపోయింది. సూపర్ స్టార్ మహేష్ హీరోగా నటిస్తున్న 26వ సినిమాకి సరిలేరు నీకెవ్వరు అంటూ టైటిల్ ని ప్రకటించడమే కాదు.. టైటిల్ పోస్టర్లో 2020 సంక్రాంతికి విడుదల అంటూ అధికారికంగా ప్రకటించారు. ఇక ప్రభాస్ నటిస్తున్న జాన్ కూడా  సంక్రాంతి బరిలోనే రిలీజ్ కానుంది. అల్లు అర్జున్- త్రివిక్రమ్ కాంబినేషన్ లో రాధాకృష్ణ- అల్లు అరవింద్ సంయుక్తంగా నిర్మిస్తున్న భారీ చిత్రం 2020 సంక్రాంతి బరిలో ఉంది. 


బన్ని కెరియర్ లో ఎంతో ప్రతిష్ఠాత్మక చిత్రమిది. త్రివిక్రం ఈ సారీ బన్నీతో పక్క హిట్ కొట్టాలని పంతంతో తెరకెక్కిస్తున్నాడట. అలాగే కింగ్ నాగార్జున కళ్యాణ్ కృష్ణ తెరకెక్కించనున్న బంగార్రాజు సంక్రాంతికి రిలీజయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది. అంతేకాదు నటసింహా నందమూరి బాలకృష్ణ- కె.ఎస్.రవికుమార్ ప్రాజెక్టు సెట్స్ కెళ్లడం కొంత ఆలస్యమైనా సంక్రాంతి రేసులోనే రిలీజ్ చేయాలన్న ప్లాన్ ఉందని ఇదివరకు ప్రచారమైంది. ఇక వీళ్లతో పాటు ఇప్పుడున్న నవతరం హీరోల్లో నాని- శర్వానంద్- నాగచైతన్య- అఖిల్ లాంటి హీరోల సినిమాలు కూడా సంక్రాంతి బరిలో రిలీజయ్యేందుకు ఆస్కారం ఉంది. మరి 2020 లో ఎవరి కాంబినేషన్ బ్లాక్ బస్టర్ హిట్ కొడతారో చూడాలి. 


మరింత సమాచారం తెలుసుకోండి: