టైటిల్ కాస్త విచిత్రంగా ఉందని ఆశ్చర్యపోవచ్చు.. ఇద్దరు లేడీస్ డేటింగ్ చేయడం ఏంటని కొందరు షాక్ అవుతున్నా ఫారిన్ కంట్రీస్ లో ఇప్పటికే ఆ కల్చర్ మొదలైంది. మనదగ్గర అది కుదరకపోవచ్చు.. అయితే బాలీవుడ్ స్టార్ హీరోయిన్స్ తమ మనోగతంలో వాళ్ల ఇష్టాలను బయటపెట్టే క్రమంలో హీరోయిన్స్ షాకింగ్ కామెంట్స్ చేస్తున్నారు.


బాలీవుడ్ క్రేజీ హీరోయిన్ కత్రినా కైఫ్ ప్రస్తుతం భరత్ సినిమాలో నటిస్తుంది. సల్మాన్ ఖాన్ హీరోగా నటించిన ఈ సినిమా ప్రమోషన్స్ లో కత్రినా కైఫ్ మీరు మిగతా హీరోయిన్ తో డేటింగ్ చేయాల్సి వస్తే ఎవరిని ఎంచుకుంటారు అంటే నిమిషం ఆగకుండా కరీనా కపూర్ పేరు చెప్పింది కత్రినా కైఫ్. 


కరీనా అందమైన తెలివి గల అమ్మాయి.. ధైర్యం కూడా ఆమెకు చాలా ఉంటుంది. కరీనా, కత్రినా ఇద్దరు క్లోజ్ ఫ్రెండ్స్.. అందుకే ఆమె తను డేటింగ్ చేయాల్సి వస్తే కరీనా పేరుని చెప్పింది. ఇక బాలీవుడ్ లో క్రేజీ హీరోయిన్ గా కత్రినా ఇప్పటికి వరుస అవకాశాలు అందుకుంటుంది. చాలా రోజుల తర్వాత ఆమె సల్మాన్ ఖాన్ సరసన నటించింది.


ఇక సల్మాన్ ఖాన్ ను భాయ్ జాన్ అంటారా అనే ప్రశ్నకు కూడా సల్మాన్ నాకు అన్న కాదు నాకు మంచి స్నేహితుడని షాక్ ఇచ్చింది కత్రినా కైఫ్. సల్మాన్ ఖాన్ భరత్ సినిమాలో సల్మాన్ సరసన కత్రినా తో పాటుగా దిశా పటాని నటించింది. చూస్తుంటే కత్రినా మళ్లీ బాలీవుడ్ లో చక్రం తిప్పేలా ఉంది.



మరింత సమాచారం తెలుసుకోండి: