రాశి ఖన్నా తెలుగులో మొదట్లో చిన్న హీరోల సరసన నటించితరువాత మెల్ల మెల్లగా పెద్ద హీరోల సరసం నటించి తనకంటూ మంచి ఇమేజ్ ను సంపాదించుకున్నది. అయితే రాశి సామజిక మాధ్యమాలను ఆడుకోవడంలో దిట్ట.  అందుకే రెండు రోజులకోసారి .. లేదా ప్రతి రోజూ ఒక అప్డేట్ తో అభిమానులను మురిపిస్తూ ఉంటుంది.  ఒకసారి హాట్ ఫోటోలు.. మరోసారి తన సినిమాలకు సంబంధించిన అప్డేట్స్.. ఇంకోసారి కవర్ పేజి ఫోటో షూట్లు.. ఇలా సాగుతుంది వ్యవహారం.


తాజాగా వివా లా మోర్ అనే మ్యాగజైన్ కవర్ పేజిపై తళుక్కుమని తారలాగా మెరిసింది. ఈ కవర్ పేజి ఫోటోను తన ఇన్స్టా ఖాతా ద్వారా పోస్ట్ చేసి "ఎవరూ మీ హార్డ్ వర్క్ ను దొంగిలించలేరు. కొంచం ఆలస్యం అవుతుందేమో కానీ మీరు మీ గమ్యాన్ని చేరుకుంటారు.  మీ గోల్ పై దృష్టి ఉంచండి.. మీపై మీకు నమ్మకం ఉండాలన్న విషయం ఎల్లప్పుడూ గుర్తుంచుకోండి. ప్రేమతో.  #వివా లా మోర్ మ్యాగజైన్.


లొకేషన్: నోవోటెల్ చెన్నై" అంటూ  క్యాప్షన్ ఇచ్చింది.కవర్ పేజిపై "రాశి ఖన్నా - దేవుడిని..నుదుటి రాతను.. కష్టాన్ని గట్టిగా నమ్మే వ్యక్తి" అంటూ ఒక క్యాప్షన్ కూడా ఉంది. జూన్ 2019 ఎడిషన్ కవర్ పేజీపై రాశి ఖన్నా ఇలా మురిసింది. ఫోటో విషయానికివస్తే.. బ్రౌన్ కలర్ స్కర్ట్.. బ్లాక్ అండ్ వైట్ డిజైన్ లో ఉన్న టాప్ తో మెస్మరైజ్ చేస్తోంది.  వెడల్పాటి అందమైన స్లీవ్స్..  ఫ్రంట్ పార్ట్ ఓపెన్ గా ఉంచిన డిజైన్ తో ఇంటర్నేషనల్ మోడల్ లాగా కనిపిస్తోంది. నడుముపై రెండు చేతులు పెట్టుకొని.. నాకంటే ఎవరైనా స్టైల్ గా ఉన్నారా అన్నట్టుగా చూస్తోంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: