డైరెక్టర్ తేజది విభిన్నమైన శైలి. అందరు దర్శకుల్లా కాకుండా తేజ ఆలోచనలు ఎప్పుడూ విభిన్నంగాఉంటాయి. తన సినిమాలతో ఎంతో మంది కొత్త నటీ నటులను పరిచయం చేసాడు తేజ. ఏదైనాఉన్నది ఉన్నట్లుగా మాట్లాడటం తేజకు అలవాటు.


అలా ఒక ఇంటర్వ్యూలో తేజ నిజం సినిమా గురించి చెబుతూ ఆ సినిమాలో ఒక గొప్ప యాక్టర్ఉన్నాడని అతను ఎన్నిసార్లు చెప్పినా తనకు నచ్చిందే చేస్తాడని డైరెక్టర్ల మాట వినడని అలావిననపుడు అతను ఎంత గొప్ప యాక్టర్ ఐనప్పటికీ ప్రయోజనం లేదని చెప్పాడు. అతని పేరుమాత్రం ఎంత అడిగినా చెప్పలేదు.


ఎన్టీయార్ బయోపిక్ గురించి కూడా తేజ మాట్లాడుతూ తాను ఈ సినిమా చూడలేదని ఎన్టీయార్బయోపిక్ నుండి కావాలనే తప్పుకున్నానని ఒకవేళ నేను ఆ సినిమా తీసి ఉంటే అంతకంటేదారుణమైన ఫలితం వచ్చి ఉండేదని తేజ చెప్పాడు. తేజ దర్శకత్వం వహించిన గత నెలలోవిడుదలైన సీత సినిమా దారుణమైన ఫలితాన్ని అందుకున్న విషయం తెలిసిందే. ఇంతకీ తేజచెప్పిన ఆ గొప్ప యాక్టర్ ఎవరై ఉంటారో.


మరింత సమాచారం తెలుసుకోండి: