ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో సెన్సేషనల్ కాంబినేషన్లో ఒక కాంబినేషన్ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ జె.డి.చక్రవర్తి కాంబినేషన్. వీరిద్దరి కలయికలో వస్తున్న సినిమా అంటే ఖచ్చితంగా సినిమా ప్రేమికులు ఎంతో ఆసక్తి చూపుతారు ఆ సినిమాపై. ఇటువంటి క్రమంలో వీరిద్దరి కలయికలో మరొకసారి చాలా కాలం తర్వాత సినిమా రాబోతున్నట్లు ఫిలింనగర్ టాక్. గతంలో రామ్ గోపాల్ వర్మ తెరకెక్కించిన శివ సినిమాలో జె.డి.చక్రవర్తి విలన్గా నటించి అందరినీ మెప్పించారు.


ఆ తర్వాత వీరిద్దరి కలయికలో చాలా సినిమాలు వచ్చాయి. అయితే బాలీవుడ్ ఇండస్ట్రీలో వీరిద్దరి కలయికలో వచ్చిన సత్య సినిమా అప్పట్లో ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ లోనే సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ హిట్ సినిమాగా నిలిచింది. అయితే మళ్ళీ చాలా ఏళ్ల తరువాత ఈ కాంబినేషన్ సెట్స్ పైకి వెళ్లనుంది. అయితే ఆ ప్రాజెక్ట్ ను వర్మ డైరెక్ట్ చేయడం లేదు. తన అసిస్టెంట్ దర్శకుడికి ఛాన్స్ ఇచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.


వర్మ కేవలం సినిమా తన ప్రొడక్షన్ లో నిర్మించనున్నాడు. అప్పట్లో నటుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న జేడీ.చక్రవర్తి ఈ మధ్య ఎక్కువగా సినిమాల్లో నటించడం లేదు. ఆఫర్స్ బాగానే వస్తున్నప్పటికీ కేవలం తనకు నచ్చిన కథలను మాత్రమే సెలెక్ట్ చేసుకుంటున్నాడు. రేపు రిలీజ్ కానున్న హిప్పీ సినిమాలో జెడి నటించాడు. ఈ సినిమా ద్వారా ప్రేక్షకులకు సరికొత్త జెడి కనిపించబోతున్నాడు.   

 



మరింత సమాచారం తెలుసుకోండి: