టాలీవుడ్ లో లేడీ అమితాబ్ గా పేరుగాంచిన నటి విజయశాంతి. ఇక తెలుగు సినిమాల్లోకి సూపర్ స్టార్ కృష్ణ సరసన ఖిలాడీ కృష్ణుడు సినిమాతో అరంగేట్రం చేసిన విజయశాంతి, ఆ తరువాత మెల్లగా వరుసగా సినిమా అవకాశాలు దక్కించుకున్నారు. ఆపై అందరూ ఆగ్రహ హీరోల సరసన నటించిన ఆమె, మంచి స్టార్ హీరోయిన్ స్టేటస్ ని దక్కించుకున్నారు. అయితే అంతటితో ఆగకుండా, కర్తవ్యం, ఆశయం వంటి లేడీ ఓరిటెంటెడ్ సినిమాల్లో నటించి తనకంటూ కొంత ప్రత్యేక గుర్తింపు సంపాదించారు విజయశాంతి. 

అయితే ఆ తరువాత కాలంలో వరుసగా సినిమాలు చేసిన విజయశాంతి కొన్ని విజయాలు, కొన్ని అపజయాలు దక్కించుకున్నారు. ఆపై మెల్లగా సినిమాలు తగ్గించిన ఆమె,అనంతరం రాజకీయాలపై దృష్టి పెట్టారు. బీజేపీ పార్టీ ద్వారా రాజకీయ రంగప్రవేశం చేసిన విజయశాంతి, ఆ తరువాత తల్లితెలంగాణ పార్టీ ని నెలకొలిపారు. ఆపై తన పార్టీని టిఆర్ఎస్ పార్టీలో విలీనం చేసిన విజయశాంతి, కొన్ని కారణాల వలన ఆ పార్టీ నుండి బయటకు వచ్చారు. తరువాత ఆమె కాంగ్రెస్ పార్టీ తీర్ధం పుచ్చుకున్నారు. ఇక ప్రస్తుతం ఆమె అదే పార్టీలో కొనసాగుతున్నారు. అయితే ఇటీవల ఆమె సూపర్ స్టార్ మహేష్ నటించబోయే కొత్త సినిమా సరిలేరు నీకెవ్వరు ద్వారా సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇస్తున్నట్లు ప్రకటించడంతో ఆమె రాజకీయాలకు స్వస్తిపలికి, ఇకపై సినిమాల్లోనే నటిస్తారా అంటూ పలు కథనాలు ప్రచారం అవుతున్నాయి. 

ఇక వీటన్నిటికీ చెక్ పెడుతూ విజయశాంతి, నిన్న తన సోషల్ మీడియా మాధ్యమాల ద్వారా తాను రాజకీయాలకే ముఖ్యంగా ప్రాధాన్యత ఇస్తానని, అయితే ఇటీవల ఎన్నికలు ముగిసిన నేపథ్యంలో తమ పార్టీ తరపున సమస్యలపై పోరాడడానికి కొంత సమయం పడుతుందని, కాబట్టి ఈ ఖాళి సమయంలో తాను సినిమాలు చేయాలనీ భావించినట్లు చెప్పుకొచ్చారు. అంతేకాని తాను సినిమాల్లో నటించినంతమాత్రాన రాజకీయాలకు స్వస్తి పలికినట్లు కాదని, కాబట్టి ప్రస్తుతం ప్రచారం అవుతున్న ఈ వార్తలన్నీ ఒట్టి పుకార్లేనని ఆమె కొట్టిపారేశారు. అయితే ఆమె కేవలం మహేష్ తో చేస్తున్న సినిమాలో మాత్రమే నటిస్తారా, లేక ఇకపై మరికొన్ని సినిమాల్లోకూడా నటిస్తారా లేదా అనేది చూడాలి....!! 


మరింత సమాచారం తెలుసుకోండి: