గ్లోబల్ హీరోయిన్ ప్రియాంక అందాల ఆరబోత గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనేముంది. హాలీవుడ్ కు కూడా దడ పుట్టించే మాదిరిగా అందాలను చూపించగలదు. తాజాగా ప్రియాంక చోప్రా తన ఇన్స్టా ఖాతా ద్వారా ఒక ఫోటో పోస్ట్ చేసింది.  ఈ ఫోటోకు ఒక చేంతాడంత పెద్ద మెసేజ్ ను క్యాప్షన్ గా ఇచ్చింది. అదంతా రఫ్ గా అనువందించుకుంటే ఇలా ఉంది "ఫ్యాషన్ అనేది గ్లోబల్ కల్చర్ లో ఒక భాగం.. ఒక్కోసారి అది శతాబ్దాల సంప్రదాయాల నుండి పుడుతుంది.


  ఋతువులు మారినట్టు ఆ స్టైల్లో మార్పు ఉండదు.  'చీర' అలాంటి ఐకానిక్ స్టేటస్ ఉన్న.. అంతర్జాతీయంగా గుర్తింపు ఉన్న ఇండియన్ స్టైల్.  చీర అందం దాని విభిన్నతలో ఉందని నా అభిప్రాయం. చీరలో ఒక హుందాతనం.. ఆడతనం.. శక్తి.. అన్నీ ఉన్నాయి.  నేను ఇప్పుడు అవన్నీ ఫీల్ అవుతున్నాను.   ఇన్ స్టైల్ మ్యాగజైన్ జులై ఎడిషన్ కోసం చీర కట్టుకొని పోజిచ్చినందుకు గర్వపడుతున్నాను.  ఇండియాకు చెందిన అద్బుతమైన ఫ్యాషన్ ను ఇలా ప్రపంచంతో పంచుకునేందుకు సహకరించిన క్రియేటివ్ పార్టనర్ లారా బ్రౌన్ కు కృతజ్ఞతలు" అంటూ క్యాప్షన్ ఇచ్చింది.


తళతళా మెరుస్తున్న్ క్రీమ్ కలర్ శారీలో ఒక హాట్ పోజిచ్చింది. ఏమాటకామాటే చెప్పుకోవాలి. చీర గురించి భారతీయ వస్త్రధారణ గురించి పెద్ద మెసేజ్ ఇచ్చింది కాని.. ఆ చీరకు మ్యాచింగ్  టాప్(అదేనండీ బ్లౌజ్.. రవిక.. జాకెట్టు.. ఇలా పలు రకాలుగా పిలుచుకుంటారు కదా) ఉంటుందని మాట మాత్రానికైనా చెప్పలేదు.  అలా అది వేసుకుంటే హాట్ గెటప్ ఎలా అవుతుంది?  పైగా వెనక్కు తిరిగి పోజివ్వడంతో ఆమె వీపు భాగం అంతా కనిపిస్తోంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: