మెగా హీరో వరుణ్ తేజ్ ప్రస్తుతం హరీష్ శంకర్ దర్శకత్వంలో వాల్మీకి సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే. ఇక ఇటీవల తొలిప్రేమ, ఎఫ్2 సినిమాలతో మంచి విజయాలు తన ఖాతాలో వేసుకున్న వరుణ్, మధ్యలో చేసిన అంతరిక్షం సినిమాతో పర్వాలేదనిపించాడు. అయితే ఇప్పుడు చేస్తున్న వాల్మీకి కూడా ఎలాగైనా హిట్ కావాలని ఎంతో శ్రమ పడుతున్నాడట. ఇక హరీష్ కు కూడా ప్రస్తుత సమయంలో హిట్ తప్పనిసరిగా అవసరం అనే చెప్పాలి. అయన అప్పుడెప్పుడో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో తెరకెక్కించిన గబ్బర్ సింగ్ సినిమా సూపర్ డూపర్ హిట్ గా నిలిచిన విషయం తెలిసిందే. 

అయితే ఆ తరువాత ఆయన జూనియర్ ఎన్టీఆర్ తో చేసిన రామయ్య వస్తావయ్యా అట్టర్ ఫ్లాప్ అవ్వగా, ఆపై సాయి  ధరమ్ తేజ్ తో చేసిన సుబ్రహ్మణ్యం ఫర్ సేల్ బాగానే ఆడింది. కాగా ఇటీవల స్టైలిష్ స్టార్ తో అయన రూపొందించిన డీజే మాత్రం కాస్త పర్వాలేదనిపించింది. కాబట్టి ప్రస్తుత పరిస్థితుల్లో వరుణ్ కంటే హరీష్ కె హిట్ అవసరమని అంటున్నారు సినీ విశ్లేషకులు. అయితే ప్రస్తుతం వరుణ్ తో తీస్తున్న వాల్మీకి సినిమా తమిళంలో మంచి విజయం సాధించిన జిగర్తాండ సినిమాకి రీమేక్ అనే విషయం తెలిసిందే. నిజానికి తమిళ్ లో వరుణ్ చేసిన పాత్రను బాబీ సింహ పోషించడం జరిగింది. ఇక మన తెలుగు నేటివిటీకి తగ్గట్లు వరుణ్ పాత్రకు  దర్శకుడు హరీష్ మరింత మసాలాను జోడిస్తున్నట్లు సమాచారం. 

ఇకపోతే మంచి కంటెంట్ ఉన్న సినిమాలను తనదైన ఆకట్టుకునే శైలి మాస్, యాక్షన్ సీన్లు కలగలిపి తెరకేకించడంలో హరీష్ మంచి దిట్ట అనే చెప్పాలి. హిందీ దబాంగ్ తో పోలిస్తే అయన పవన్ తో తీసిన గబ్బర్ సింగ్ ఎంత పెద్ద విజయం అందుకుందో తెలిసిందే. ఇక మొత్తంగా దీన్ని బట్టి చూస్తుంటే, ప్రస్తుతం వరుణ్ తో హరీష్ తెరకెక్కిస్తున్న ఈ వాల్మీకి మంచి కథ, కథనాలతో పాటు మరిన్ని మాస్ మరియు యాక్షన్ హంగులు కూడా సినిమాకు జోడిస్తే, తప్పకుండా  ఈ సినిమా కూడా గబ్బర్ సింగ్ రేంజ్ హిట్ అయి తీరుతుందని అంటున్నారు సినీ విశ్లేషకులు...!!


మరింత సమాచారం తెలుసుకోండి: