తమిళం, మళయాళం, కన్నడ హీరోయిన్స్ తెలుగులో హీరోయిన్ గా ఛాన్స్ కోసం ఎదురు చూస్తుంటారు. ఫస్ట్ సినిమా గనక హిట్టైతే తెలుగులో సెటిలవ్వాలని..మిగతా హీరోయిన్స్ కి చెక్ పెట్టాలని, ఇండస్ట్రీని కొన్నేళ్ళ పాటు ఏలేద్దామని అనుకుంటారు. అది కొంతమందికి బాగా వర్కౌట్ అవుతుంది. కొంతమందికి మాత్రం రివర్స్ అవుతుంది. ఇప్పుడు 'హిప్పీ'  హీరోయిన్ పరిస్థితి కూడా అంతే. అనుకున్నది ఒక్కటి అయినది ఒక్కటి బోల్తా పడ్డాదిలే బుల్ బుల్ పిట్ట అన్న మాట దిగంగన ని చూస్తే అనిపిస్తుంది పాపం.


హిప్పీ సినిమాలో కార్తికేయకి జోడిగా నటించిన దిగంగన సూర్యవంశీ గురించి హిప్పీ ప్రీ రిలీజ్ ఈవెంట్ నుండి మీడియాలో హాట్ టాపిక్ గా మారిందన్న విషయం ప్రతీ ఒక్కరికి తెలిసిందే. గుండ్రని మొహంతో, మత్తెక్కించే కళ్ళతో, అందమైన శరీరాకృతితో హాట్ యాంగిల్ అయినా, రొమాంటిక్ మూవీసైనా, లిప్ లాక్స్ అయినా తగ్గనని చెప్పే ఆమె వాలకంతో అన్నీ సమపాళ్లలో రంగరించి కలగలిపిన హాట్ హీరోయిన్‌లా దిగంగన సూర్యవంశీ ఉందని అందరు అనుకున్నారు.


హిప్పీ సినిమా గనక హిట్ అయితే ఈ అమ్మాయి కూడా క్లిక్ అవుతుందని అన్నారు. మరి నిజంగానే చూడగానే ఆకర్షించే అందంతో దిగంగన సూర్యవంశీ ఈ తరం హీరోయిన్స్ కి గట్టి పోటీ ఇచ్చేలా కనబడింది. సినిమా విడుదలకు ముందు హిప్పీ ప్రీ రిలీజ్ ఈవెంట్ తర్వాత దిగంగన సూర్యవంశీ టాపిక్ మాత్రం ఫిలింసర్కిల్స్ లో హాట్ హాట్ గా నడిచింది.
అయితే నిన్న ప్రేక్షకుల ముందుకు వచ్చిన హిప్పీ సినిమాకి ప్లాప్ టాక్ రాగా అందులో కార్తికేయకి జోడిగా నటించిన దిగంగన సూర్యవంశీకి మాత్రం కాస్త మంచి మార్కులు పడుతున్నాయి. కానీ ఈ సినిమా ఫ్లాప్ గనక దిగంగన సూర్యవంశీకి అనుకున్నంతగా అవకాశాలు రావడం కష్టమే. ఎందుకంటే మొదటి సినిమాతోనే ఫ్లాప్ హీరోయిన్ అనే ముద్ర పడటం సహజం కాబట్టి.



మరింత సమాచారం తెలుసుకోండి: