అటు ప్రభాస్ కెరీర్ చూసినా లేదా ఇటు దర్శకుడు రాజమౌళి కెరీర్ చూసినా ఒకరకంగా బాహుబలి సిరీస్ కి ముందు మరియు వాటి తరువాత అనే మాట్లాడుకోవాలి. అంతేకాక ఆ సినిమాల తరువాత అటు రాజమౌళికి కానీ ఇటు ప్రబాస్ కి కానీ విపరీతమైన క్రేజ్ మరియు పేరు వచ్చాయనే చెప్పాలి. అయితే దర్శకుడిగా రాజమౌళి దేశవ్యాప్తంగా ఉన్న దర్శకుల్లో ఉన్నత స్థానాన్ని అధిరోహిస్తే, హీరోగా ప్రభాస్ కు ఒక బాలీవుడ్ స్టార్ హీరో రేంజి ఫాలోయింగ్ మరియు ఫ్యాన్ బేస్ లభించింది. 

అలానే ఈ ఇద్దరు అంత భారీ విజయాల తరువాత ఇకపై సదా సీదా సినిమాలు చేస్తే కుదరదు, వారి సినిమాలు భారీగా ఎంతో ప్రతిష్టాత్మకంగా ఉంటాయనే ప్రేక్షకులు కూడా ఆశిస్తారు. అయితే ఇప్పుడు ఇదంతా ఎందుకు చెప్పుకుంటున్నాం అంటే, బాహుబలి 2 తరువాత ప్రభాస్ భారీ బడ్జెట్ తో సాహో సినిమాలో నటిస్తుండగా, రాజమౌళి ఎన్టీఆర్ మరియు చరణ్ లతో ఆర్ఆర్ఆర్ మూవీ ని ఎంతో భారీ స్థాయిలో తెరకెక్కిస్తున్నారు. ఇక ఆర్ఆర్ఆర్ మూవీ బడ్జెట్ చూస్తే, సాహో కంటే కొంత ఎక్కువ అనే చెప్పాలి. ఇకపోతే ఓవైపు సాహోకు, మరోవైపు ఆర్ఆర్ఆర్ కు బిజినెస్ ఆఫర్లు అప్పుడే భారీ స్థాయిలో మొదలైనట్లు సమాచారం. కాకపోతే సాహో ఈ ఏడాది ఆగష్టు లో ప్రేక్షకుల ముందుకు వస్తుండగా, ఆర్ఆర్ఆర్ మాత్రం వచ్చే ఏడాది జులై నెలాఖరున ప్రేక్షకుల ముందుకు రానుంది. 

అయితే ప్రభాస్, రాజమౌళి వీరిద్దరిలో ఎవరు మరొక్కసారి బాహుబలి రికార్డులను బద్దలు కొడతారు అనే చర్చ ప్రస్తుతం టాలీవుడ్ లోను, అలానే మీడియా వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. నిజానికి ఆ రెండు సినిమాల్లో ఏది సూపర్ హిట్ టాక్ సంపాదించినా చాలా వరకు అన్ని ప్రాంతాల నుండి అద్భుతమైన కలెక్షన్లు రాబట్టడం మాత్రం ఖాయం అనే చెప్పాలి. అయితే వీరిద్దరి సినిమాల మధ్య జరిగే ఈ రసవత్తరమైన పోటీలో ఎవరి సినిమా ఎంతటి విజయాన్ని అందుకుని ఎంత మేర కలెక్షన్లు సాధిస్తుందో తెలియాలంటే మరికొన్నాళ్లు వేచిచూడాల్సిందే....!!  


మరింత సమాచారం తెలుసుకోండి: