స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ మాటల మాంత్రికుడు త్రివిక్రం కాంబినేషన్ లో ముచ్చటగా మూడవ సినిమా తెరకెక్కుతుంది. హారిక హాసిని క్రియేషన్స్, గీతా ఆర్ట్స్ కలిసి నిర్మిస్తున్న ఈ సినిమాలో పూజా హెగ్దె హీరోయిన్ గా నటిస్తుంది. సినిమాలో సీనియర్ హీరోయిన్ టబు కూడా నటిస్తుందని తెలుస్తుంది. పూజా హెగ్దెతో పాటుగా సినిమాలో నివేదా పేతురాజ్ కూడా మరో హీరోయిన్ గా నటిస్తుందని తెలుస్తుంది. 


ఇక ఈ సినిమాలో ఓ స్పెషల్ సాంగ్ కోసం కాజల్ అగర్వాల్ ను సంప్రదించారట. ఈమధ్య స్పెషల్ సాంగ్స్.. ఐటం సాంగ్స్ కు స్టార్ హీరోయిన్స్ నే తీసుకుంటున్నారు. జనతా గ్యారేజ్ సినిమాలో కాజల్ మొదటిసారి ఐటం సాంగ్ చేసింది. త్రివిక్రం, బన్ని సినిమాలో కాజల్ ఐటం సాంగ్ చేస్తుందట.


తమన్ మ్యూజిక్ అందిస్తున్న ఈ సినిమాలో కాజల్ సాంగ్ కూడా అదరగొట్టేలా ఉంటుందట. ఈ ప్రత్యేకమైన సాంగ్ కోసం కాజల్ భారీ రెమ్యునరేషన్ ఛార్జ్ చేస్తుందట. మొత్తానికి కాజల్ మరో పక్కా లోకల్ లాంటి సాంగ్ కు సిద్ధమైందని చెప్పొచ్చు. ఆల్రెడీ షూటింగ్ మొదలైన ఈ సినిమా 2020 సంక్రాంతికి రిలీజ్ ప్లాన్ చేస్తున్నారు. 


ఓ పక్క హీరోయిన్ గా వరుస అవకాశాలు అందుకుంటున్న కాజల్ కొత్తగా ఐటం సాంగ్స్ కు స్పెషల్ ఎట్రాక్షన్ గా మారింది. అమ్మడు పక్కా లోకల్ సాంగ్ కు క్రేజీ ఫాలోవర్స్ ఉన్నారు. ఇప్పటికి ఆ సాంగ్ ఓ ఊపు ఊపేస్తుంది. మరి బన్ని సినిమాలో కాజల్ ఎలాంటి సాంగ్ తో వస్తుందో చూడాలి. కాజల్ తో ఆర్య 2 సినిమా చేశాడు బన్ని ఇప్పుడు సినిమాలో స్పెషల్ సాంగ్ కోసం జత కడుతున్నారు. 



మరింత సమాచారం తెలుసుకోండి: