యాంగ్రీ స్టార్ డాక్టర్ రాజశేఖర్ హీరోగా నటిస్తున్న లేటెస్ట్ సినిమా కల్కి. ఈ సినిమా గురించి ఈ మధ్య సరైన అప్‌డేట్ లేకపోవడం తో ఏవేవో రూమర్లు వినిపించాయి. అయితే ఈ సినిమా కి సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్ తో షాక్ ఇచ్చారు చిత్ర బృందం. 'ప్రపంచవ్యాప్తంగా జూన్ 28న రాజశేఖర్ కల్కి విడుదల'! అంటూ రిలీజ్ డేట్ ను రివీల్ చేశారు. తెలుగు ప్రేక్షకులకు 'అ!' వంటి ప్రయోగాత్మక, కొత్త తరహా సినిమాని అందించిన ప్రశాంత్ వర్మ దర్శకుడు. శివానీ శివాత్మిక సమర్పణలో హ్యాపీ మూవీస్ పతాకంపై ప్రముఖ నిర్మాత సి. కళ్యాణ్ నిర్మిస్తున్నారు. శ్రవణ్ భరద్వాజ్ సంగీతం అందిస్తున్నారు. చిత్రీకరణ పూర్తయింది.


ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు శరవేగంగా జరుగుతున్నాయి. జూన్ 28న ప్రపంచవ్యాప్తంగా చిత్రాన్ని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. రాజశేఖర్, స్కార్లెట్ విల్సన్ పై చిత్రీకరించిన హార్న్ ఓకే పాటను బుధవారం రెడ్ ఎఫ్.ఎమ్ ఛానల్ లో విడుదల చేయనున్నారు.  ఈ సందర్భంగా నిర్మాత సి. కళ్యాణ్, జీవితా రాజశేఖర్ మాట్లాడుతూ పక్కా కమర్షియల్ సినిమా... కొత్త తరహాలో ఉంటుంది. ఇప్పటికే విడుదలైన కమర్షియల్ ట్రైలర్, టీజర్‌కు ఫెంటాస్టిక్ రెస్పాన్స్ లభించింది. సినిమా కూడా ప్రేక్షకులను అదే విధంగా ఆకట్టుకుంటుందని  చెప్పారు.


ఇక దర్శకుడు ప్రశాంత్ వర్మ మాట్లాడుతూ ఇండియా-పాకిస్తాన్ క్రికెట్ మ్యాచ్ ఎంత ఉత్కంఠ కలిగిస్తుందో... థియేటర్లలో ప్రేక్షకులకు కల్కి అంత ఉత్కంఠ కలిగిస్తుంది. త్వరలో థియేట్రికల్ ట్రైలర్ విడుదల చేస్తాం. నిర్మాత సి. కళ్యాణ్ గారు, జీవితా రాజశేఖర్ ఖర్చుకు వెనకాడకుండా చిత్రాన్ని నిర్మించారు అని అన్నారు. అదా శర్మ, నందితా శ్వేత, పూజితా పొన్నాడ, స్కార్లెట్ విల్సన్ రాహుల్ రామకృష్ణ, నాజర్, అశుతోష్ రాణా, సిద్ధూ జొన్నలగడ్డ, శత్రు, చరణ్ దీప్, వేణుగోపాల్, వెన్నెల రామారావు..తదితరులు ముఖ్య పాత్రల్లో నటించగా ఇంతకముందు రాజశేఖర్ నటించిన పి.ఎస్.వి.గరుడ వేగ కంటే ఇంకా పెద్ద హిట్ అవనుందని చిత్రం బృందం ధీమాగా ఉన్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: