పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో జనసేన పార్టీ తరపున పోటీ చేసిన రెండు నియోజకవర్గాల్లో ఓటమి పాలవడం జరిగింది. అయితే ఈ ఓటమితోనే అంతా అయిపోలేదని, ఇకపై మరింతగా ప్రజలకు చేరువై ప్రజా సమస్యలపై నిరంతరం గట్టిగా పోరాడి వారికి ప్రజాసంక్షేమ పధకాల ద్వారా న్యాయం జరిగేలా చూస్తామని అయన మొన్న జరిగిన మీడియా సమావేశంలో అన్నారు. అంతేకాదు కొందరు జనసేన పార్టీ పని అయిపోయింది, పవన్ ఇకపై పార్టీని నడపలేరు అంటూ తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని, 

అయితే తాను జీవించి ఉన్నంతవరకు పార్టీని వదిలేది లేదని అయన స్పష్టం చేసారు. అయితే జరిగిన ఆ సమావేశంలో పవన్ తన భవిష్యత్ రాజకీయ ప్రణాళికలు మరియు ఏ విధంగా పార్టీని మరింతగా ప్రజలకు చేరువ చేయాలి అనేటువంటి అంశాల మీదనే మాట్లాడడం జరిగింది. అయితే అక్కడ సినిమాల ప్రస్తావన మాత్రం రాలేదనే చెప్పాలి. ఇక సమావేశం అనంతరం కొందరు పవన్ ఫ్యాన్స్ అక్కడకు చేరుకొని ఆయనను సినిమాలు చేయమని కోరడం జరిగిందని, అయితే వారి అభ్యర్ధనను పవన్ సున్నితంగా తిరస్కరించారని అంటున్నారు. నిజానికి పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ నెలకొల్పిన తరువాత ఒకరకంగా సినిమాల పై మెల్లగా దృష్టి తగ్గించారు అనే చెప్పాలి. పార్టీ నెలకొల్పిన తరువాత తక్కువ సినిమాలే చేసిన పవన్, అక్కడినుండి జనసేన కార్యకలాపాలపై దృష్టి సారించారు. 

అయితే పవన్ ఫ్యాన్స్ మాత్రం అయన ఓవైపు రాజకీయాల్లో కొనసాగుతూ మరోవైపు సినిమాల్లోనూ నటించాలని ఎప్పటినుండో కోరుకుంటున్నారు. అయితే ఈ ఎన్నికల ఫలితాలతో కొంత ఆలోచనలో పడ్డ పవన్, ఇకపై సినిమాలకు దూరంగా ఉండి పూర్తిగా తన జీవితాన్ని ప్రజాసేవకే అంకితం చేయాలని సంకల్పించినట్లు సమాచారం. నిజానికి ఈ వార్త ఒకింత పవన్ ఫ్యాన్స్ కు చేదు వార్తే అయినప్పటికీ జనసేన పార్టీ ద్వారా అయన ఎప్పుడూ మనతోనే ఉంటారు అనేది కొంత ఆనందించే వార్త అనే చెప్పాలి. అయితే అయన నిర్ణయాన్ని కొంతమంది ఆయన ఫ్యాన్స్ కూడా ఆహ్వానిస్తున్నారు.....!!


మరింత సమాచారం తెలుసుకోండి: