'బిచ్చగాడు'తో తెలుగులో  భారీ విజయాన్ని అందుకున్న విజయ్ ఆంటోనీ.. ఎట్టకేలకూ మళ్లీ 'కిల్లర్'గా మరో హిట్ ను అందుకున్నాడు.  ఆండ్రూ లూయిస్‌ దర్శకత్వంలో యాక్షన్ కింగ్ అర్జున్ - విజయ్ ఆంటోని కాంబినేషన్ లో  వచ్చిన ఈ క్రైమ్ థ్రిల్లర్..  థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ తో పాటు సప్సెన్స్  ఫ్లేతో  సాగుతూ ఆకట్టుకుంది.  


ముఖ్యంగా  క్రైమ్ సన్నివేశాలు,  క్లైమాక్స్ లో వచ్చే ట్విస్ట్ లు,  అర్జున్ - విజయ్ అంటోనిల నటన  బాగా అలరించడంతో ప్రేక్షకులు సినిమా పై ఆసక్తి చూపిస్తున్నారు.  అలాగే సినిమాలో  మాక్స్ సినిమాటోగ్రఫీ సినిమాకే హైలెట్ గా నిలవడం, అలాగే  సంగీత దర్శకుడు  సైమ‌న్.కె.కింగ్ అందించిన  సంగీతం కూడా బాగా  ఆకట్టుకోవడం, మెయిన్ గా క్రైమ్ సన్నివేశాలు బాగా అలరించడం..  వంటి అంశాలు సినిమాకే  ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.  


అయితే ప్రమోషన్స్ సరిగ్గా లేకపోవడంతో  బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో కలెక్షన్స్  రాకపోయినా..  రోజురోజుకి పాజిటివ్ టాక్ తో మొత్తానికి తెలుగు రాష్ట్రాల్లో 'కిల్లర్'  హిట్ అయిందనిపించుకుంది.  ఇక  బాక్సాఫీస్ వద్ద  ఏ రేంజ్ హిటో తెలియాలంటే.. సోమవారం నుండి అన్ని ప్రాంతాల్లో రాబట్టే  కలెక్షన్స్ ను బట్టి ఈ సినిమా రేంజ్ తేలనుంది.  


మరింత సమాచారం తెలుసుకోండి: