టాలీవుడ్ లో అల్లరి చిత్రంతో హీరోగా ఎంటరైన నటుడు నరేష్. ఇక తొలిసినిమా తోనే మంచి పేరు సంపాదించిన నరేష్, అప్పటినుండి తన స్క్రీన్ నేమ్ ను అల్లరి నరేష్ గా మార్చుకున్న  విషయం తెలిసిందే. ఇక అక్కడి నుండి వరుసగా కామెడీ సినిమాల్లో నటిస్తూ వస్తున్న నరేష్ కు అప్పట్లో మంచి విజయాలతో పాటు కొన్ని అపజయాలు కూడా ఎదురయ్యాయి. అయితే ఇటీవల కాలంలో ఆయనకు చెప్పుకోదగ్గ హిట్ ఒక్కటి కూడా లేదనే చెప్పాలి. 

దానితో కొంత ఢీలా పడ్డ నరేష్ కెరీర్ కి అనుకోకుండా సూపర్ స్టార్ మహేష్ సరసన నటించే అవకాశం రావడం, ఆపై సినిమా మహేష్ తో చేసిన మహర్షి బ్లాక్ బస్టర్ హిట్ కొట్టడంతో అయన మళ్ళి ఫామ్ లోకి రావడం జరిగింది. అయితే అప్పటినుండి నరేష్ కి కేవలం హీరోగానే కాకుండా కొన్ని సపోర్టింగ్ రోల్స్ కూడా వస్తున్నాయట. అయితే వాటిని నరేష్ జాగ్రత్తగా ఎంపిక చేసుకుంటూ ముందుకు సాగుతున్నట్లు తెలుస్తోంది. ఇక కొద్దిరోజలుగా అయన మాస్ మహారాజ రవితేజ కొత్త సినిమా డిస్కో రాజాలో ఒక కీలక పాత్రలో నటిస్తున్నట్లు వార్తలు వచ్చాయి. అయితే వాటిలో నిజం లేదని కొందరు అన్నారు. ఇక నేడు అయన డిస్కో రాజాలో నటిస్తున్నట్లు ఒక ప్రకటన వచ్చిందని టాలీవుడ్ వర్గాల సమాచారం. 

అయితే దీనిపై నేడో రేపో ఆ టీమ్ నుండి అధికారికంగా ప్రకటన కూడా రానుందట. ఇక నరేష్ అందులో ఎటువంటి పాత్ర చేస్తున్నారు, అది కామెడీ నా లేక సీరియస్ రోలా అనేదానిపై మాత్రం క్లారిటీ లేదు. ఇక ఈ అవకాశం తరువాత నరేష్ కు టాలీవుడ్ లో రెండవ ఇన్నింగ్స్ మొదలైనట్లే అని, ఎంతైనా సూపర్ స్టార్ మహేష్ సినిమానా మజాకా, ఇక మున్ముందు నరేష్ చేయబోయే సినిమాలు మంచి విజయాలు అందుకోవాలని పలువురు నెటిజన్లు ఆయనకు సోషల్ మీడియా వేదికల ద్వారా అభినందనలు తెలియచేస్తున్నారు.....!! 


మరింత సమాచారం తెలుసుకోండి: