Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
Mon, Oct 21, 2019 | Last Updated 10:51 pm IST

Menu &Sections

Search

శివలింగాపురం ఆడియో, ట్రైలర్ విడుదల

శివలింగాపురం ఆడియో, ట్రైలర్ విడుదల
శివలింగాపురం ఆడియో, ట్రైలర్ విడుదల
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
తమిళ, మలయాళ భాషలలో యాక్షన్ హీరోగా పేరు తెచ్చుకున్న ఆర్.కె.సురేష్ ఇప్పుడు శివలింగాపురం చిత్రం ద్వారా తెలుగు తెరకు పరిచయమవుతున్నారు. మధుబాల కథానాయికగా నటించింది. తోట కృష్ణ దర్శకుడు. రావూరి అల్లికేశ్వరి సమర్పణలో అపోలో ప్రొడక్షన్స్ పతాకంపై రావూరి వెంకటస్వామి నిర్మిస్తున్న ఈ చిత్రం ఆడియో, ట్రైలర్ విడుదల కార్యక్రమం ఆదివారం హైదరాబాద్ లో సినీ ప్రముఖుల సమక్షంలో ఘనంగా జరిగింది. ముఖ్యఅతిథిగా విచ్చేసిన నిర్మాత చదలవాడ శ్రీనివాసరావు ఆడియోను ఆవిష్కరించగా...ట్రైలర్ ను హీరో ఆర్.కె.సురేష్ విడుదలచేశారు. నిర్మాత రావూరి వెంకటస్వామి ఏవీని మరో అతిథి సాయివెంకట్ ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా చదలవాడ శ్రీనివాసరావు మాట్లాడుతూ, సినిమాలు తీయడమే కాకుండా సమాజానికి ఎంతో సేవ చేసిన వ్యక్తిగా రావూరి వెంకటస్వామికి మంచి పేరుంది. అభిరుచితో ఆయన తీసిన ఈ చిత్రం విజయవంతం కావాలి. ఈ చిత్రం హీరో ఆర్.కె.సురేష్ ను చూస్తుంటే జూనియర్ రజనీకాంత్ మాదిరిగా...ప్రతినాయకుడిగా నటించిన డి.ఎస్.రావును చూస్తుంటే జూనియర్ అమ్రిష్ పురిలా అనిపిస్తున్నారు. ఇలాంటి మంచి సినిమాలు, చిన్న సినిమాలు విరివిగా రూపొందినపుడే పరిశ్రమను నమ్ముకున్న వారందరికీ పని దొరుకుతుంది. త్వరలో జరగబోయే నిర్మాతల మండలి ఎన్నికలలో మంచి మండలిని ఎన్నుకుంటే చిన్న చిత్రాలకు కూడా న్యాయం జరుగుతుంది అని అభిప్రాయపడ్డారు. మరో అతిథి టి.ప్రసన్నకుమార్ మాట్లాడుతూ, పలు విద్యాసంస్థల అధినేతగా పేరున్న రావూరి వెంకటస్వామి ఎంతో అభిరుచితో సినిమాలను తీస్తున్నారు.

ఆయన తీసిన ఈ చిత్రం ఒకప్పుడు వచ్చిన భక్త సిరియాళ చిత్రం కోవలో ప్రేక్షకులను అలరించాలని కోరుకుంటున్నా అని అన్నారు. చిత్ర నిర్మాత రావూరి వెంకటస్వామి మాట్లాడుతూ, గతంలో లిటిల్ హార్ట్స్, మా తల్లి గంగమ్మ, కొక్కొరోకో వంటి సినిమాలు తీశాను. ఇది ఆరవ చిత్రం. ఒకప్పుడు మాది చాలా పేద కుటుంబం. మేము పెరిగిన లొకేషన్ లో ఈ చిత్రంలోని కొన్ని సన్నివేశాలను చిత్రీకరించడం జరిగింది. కృషి, పట్టుదలతోనే ఈ రోజు ఉన్నతి స్థితికి చేరుకోవడం జరిగింది. తోట కృష్ణ దర్శకత్వంలోనే ఇంకో చిత్రం చేయాలని అనుకుంటున్నాను. దర్శక, నిర్మాతల బంధం సినిమా మొదలయ్యేటప్పుడు ఉన్నట్లు...పూర్తయిన తర్వాత ఉండటం లేదు. కానీ తోట కృష్ణ తాను చెప్పిన బడ్జెట్ లోనే సినిమాను పూర్తిచేసే నిర్మాతల దర్శకుడిగా మొదట్నుంచి పేరు తెచ్చుకున్నారు. ఈ నెలాఖరులో చిత్రాన్ని విడుదల చేయాలనుకుంటున్నాం అని అన్నారు. చిత్ర దర్శకుడు తోట కృష్ణ మాట్లాడుతూ, గ్రామీణ నేపథ్యంలో యాక్షన్, ఫాంటసీ ఎంటర్ టైనర్ గా ఈ చిత్రాన్ని మలచడం జరిగింది. ఇందులో అన్నా, చెల్లెల సెంటిమెంట్ హైలైట్ అవుతుంది. ఇదే బేనర్ లో కొత్త చిత్రం చేయడానికి సిద్ధంగా ఉన్నాను అని అన్నారు. ప్రతినాయకుడి పాత్రధారి డి.ఎస్.రావు మాట్లాడుతూ, నటుడు కావాలనే చిత్ర పరిశ్రమలోనికి వచ్చాను. అయితే నిర్మాతగా మారి పలు చిత్రాలు చేశాను. ఇప్పుడు నటుడిగా కూడా సినిమాలు చేస్తున్నాను. ఈ చిత్రంలోని నెగటివ్ పాత్ర నాకెంతో పేరు తెచ్చిపెడుతుంది అని అన్నారు.

చిత్ర హీరో ఆర్.కె. సురేష్ మాట్లాడుతూ, ఇప్పటివరకు తమిళ, మలయాళం వివిధ భాషలలో పలు చిత్రాలలో నటించాను. తెలుగులో నాకిది మొదటి చిత్రం. సినిమారంగంతో మా కుటుంబానికి మంచి అనుబంధం ఉంది అని అన్నారు. తనకు అవకాశమిచ్చిన దర్శక, నిర్మాతలకు హీరోయిన్ మధుబాల కృతజ్ఞతలు తెలిపారు. ఇంకా ఈ కార్యక్రమంలో అతిథులుగా పాల్గొన్ననిర్మాతలు తుమ్మపల్లి రామసత్యనారాయణ, మోహన్్ వడ్లపట్ల, సాయివెంకట్, రాకేష్ రెడ్డి, పద్మిని నాగులపల్లి తదితరులంతా చిత్రం విజయవంతం కావాలని ఆకాంక్షించారు.


suresh
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
‘కమ్మరాజ్యంలో కడప రెడ్లు’ ట్రైల‌ర వ‌చ్చేస్తోంది కాస్కోండి...?
`ప్లానింగ్`కి ప్లాన్ బానేవేశారుగా...?
'మా' లో విబేధాలు నిజమే.. ఒప్పేసుకున్న జీవిత..?
జిందా గ్యాంగ్ ఏం చేయ‌బోతుందో...?
పోలీసుల‌కు చుక్క‌లు చూపిన రేవంత్‌...!
చిరంజీవిని ఆ దేవుడి కాన్సెప్ట్ కాపాడుతుందా?
కార్తీ ఎమోష‌న్స్ ఖైదీకి వ‌ర్క‌వుట్ అవుద్దా...?
ప్ర‌గ‌తి భ‌వ‌న్ ముట్ట‌డి ఉద్రిక్త‌త‌...కాంగ్రెస్ నేత‌లు అరెస్ట్‌
'కృష్ణారావ్‌ సూపర్‌మార్కెట్‌' లో స‌స్పెన్స్ స‌స్టైన్ అయ్యింద‌ట‌
`ఉప్పెన` లా వ‌స్తున్న వైష్ణ‌వ్‌తేజ్‌
ఈ నూనెతో ఇన్ని లాభాలా...?
"ఊల్లాల ఊల్లాల" అంటూ ఉర్రూతలూగించనున్న మంగ్లీ
ర‌చ‌యిత‌ల సంఘం సిల్వ‌ర్‌ జూబ్లీలో కృష్ణంరాజు హామీ
రివ్వ్యూలు వెంట‌నే రాయొద్దంటున్న హీరో
ప్రేమ పిపాసి రూల్స్‌ని బ్రేక్ చేస్త‌దా...?
90ఎం.ఎల్‌. `దేవ‌దాస్‌` అజర్ బేజాన్ వెళ్లనున్నాడా...?
సినిమాని ప్ర‌మోట్ చెయ్య‌డం అంద‌రి బాధ్య‌తంటున్న‌ రాక‌స్టార్‌
ఇస్మార్ట్ భామ మ్యూజిక్ డైరెక్ట‌ర్ బాద్షాతో క‌లిసి చిందులేసిందా...?
ఎర్ర‌చీర‌లో శ్రీ‌కాంత్ అఘోరా...?
కృష్ణారావ్‌ సూపర్‌మార్కెట్‌ లో ఏం దొరుకుద్దో...?
ఇక్కట్ల‌లో ప్రజలు
జుట్టు ఒత్తుగా పెర‌గాలంటే ఇవి తినాల్సిందే...!
రాత్రిపూట మ‌నం చేసే త‌ప్పులే మ‌న‌కు శాపాలా...?
About the author

Bharath has been the knowledge focal point for the world, As Darvin evolution formula End is the Start ... Bharath again will be the Knowledge Focal Point to the whole world. Want to hold the lamp and shine light on the path of greatness for our country Bharath.