టాలీవుడ్ యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ లేటెస్ట్ సెన్సేషన్ మూవీ సాహో టీజర్ కోసం ఎప్పటినుండో అయన అభిమానులు ఎంతో ఆశగా ఎదురుచూస్తున్న విషయం తెలిసిందే. నిజానికి కేవలం ప్రభాస్ ఫ్యాన్స్ మాత్రమే కాదు, సాధారణ ప్రేక్షకులు సైతం ఈ టీజర్ కోసం ఎంతగానో ఎదురుచూస్తున్నారు అనే చెప్పాలి. ఇకపోతే కాసేపటి క్రితం ఈ సినిమా టీజర్ ఈనెల 13న విడుదల చేయబోతున్నట్లు యువి క్రియేషన్స్ సంస్థ తమ అధికారిక సోషల్ మీడియా అకౌంట్స్ లో పోస్ట్ చేయడం జరిగింది.

అంతేకాదు దానితోపాటు సాహో లో హీరోయిన్ గా నటించిన శ్రద్ధ కపూర్ గన్ పట్టుకుని ఉన్న ఒక ఫెంటాస్టిక్ స్టిల్ కూడా విడుదల చేయడం జరిగింది. ఇక ఆ పోస్టర్ లో సినిమాను ప్రపంచవ్యాప్తంగా స్వతంత్ర దినోత్సవ కానుకగా ఆగష్టు 15న విడుదల చేస్తున్నట్లు ప్రకటించింది. ఇక ఈ టీజర్ లో ప్రత్యేకతలు ఇవేనంటూ కాసేపటి క్రితం నుండి పలు మీడియా మాధ్యమాల్లో కొన్ని కథనాలు ప్రచారం అవుతున్నాయి. వారు చెప్తున్న వివరాల ప్రకారం, టీజర్ ఆద్యంతం మంచి యాక్షన్ మోడ్ లో సాగుతుందట. 

ఇక టీజర్లో ప్రభాస్ వి రెండు యాక్షన్ ఛేజింగ్ సీన్స్ తో పాటు మధ్యలో హీరోయిన్ శ్రద్ధ కూడా గన్ పట్టుకుని శత్రువులని చెండాడే సీన్ కూడా ఉంటుందని సమాచారం. ఇక ఈ టీజర్ లో వచ్చే బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ కూడా అదిరిపోయిందని, ఒకరకంగా ఎప్పటినుండో ఎంతో ఆకలిగా ఉన్న ప్రభాస్ ఫ్యాన్స్ కు ఈ టీజర్ రూపంలో ఒక మంచి ఫీస్ట్ ఖాయమని అంటున్నారు. మొత్తంగా దీన్నిబట్టి చూస్తుంటే, ఒకవేళ ఈ వార్త కనుక నిజమే అయితే, సాహో టీజర్ తోనే ప్రభాస్ ఫ్యాన్స్ చాలావరకు ఖుషి అయ్యే అవకాశం కనిపిస్తోంది....!!


మరింత సమాచారం తెలుసుకోండి: