ఈ ఏడాది వచ్చిన సమ్మర్ సీజన్ కేవలం మహర్షి సినిమా తప్ప పెద్ద సినిమాలు ఏవి రిలీజ్ కాలేదు. విడుదలైన మహర్షి సినిమా సూపర్ డూపర్ హిట్ అయింది. మహేష్ కెరీర్లోనే అత్యంత భారీ కలెక్షన్లు సాధించిన సినిమాగా రికార్డులు సృష్టించింది. అయితే ఆ తర్వాత వచ్చిన చిన్న చిన్న సినిమాలు పెద్దగా బాక్సాఫీస్ దగ్గర అలరించలేకపోయాయి.


అయితే ఈ శుక్రవారం 14 వ తేదీ తెలుగు-హిందీ-ఇంగ్లీష్ కలిపి మొత్తం దాదాపు 12 సినిమాలు రాబోతున్నాయి. ఇంకేం పండగ అనుకునే ఛాన్స్ లేదు. అన్ని మీడియం లేదా లో బడ్జెట్ మూవీస్ కావడమే మరీ ప్రత్యేకంగా ఫీలయ్యే అవకాశం ఇవ్వడం లేదు. థ్రిల్లర్ జానర్ లో వస్తున్న విశ్వామిత్ర మీద ఏమంత బజ్ లేదు. గీతాంజలి దర్శకుడు రాజ్ కిరణ్ టేకప్ చేసిన ఈ మూవీ ఇప్పటికే పలు వాయిదాలు పడి ఈ డేట్ లాక్ చేసుకుంది.


సప్తగిరి హీరోగా రూపొందిన వజ్రకవచధరి గోవిందా మీద ఓ వర్గం మాస్ ఆడియన్స్ తప్ప అందరూ లుక్కేసే ఛాన్స్ లేదు. టాక్ మరీ బాగుంటే ఏమైనా ఆశించవచ్చు. ఉపేంద్ర కన్నడ డబ్బింగ్ ఐ లవ్ యు కూడా ఇదే తరహాలో హైప్ లేకుండా వస్తోంది. ఇంకా మరికొన్ని సినిమాలు కూడా రిలీజ్ అవుతున్నాయి. కానీ విడుదలవుతున్న సినిమాలపై ఏ సినిమా పై కూడా పెద్దగా అంచనాలు లేకపోవడం గమనార్హం. ఏదిఏమైనా వేసవి సీజన్ ముగింపులో ఒక్క రోజే 12 సినిమాలు విడుదల కావడం సినిమా ప్రేక్షకులకు పండగే అని చెప్పవచ్చు.



మరింత సమాచారం తెలుసుకోండి: