బాహుబలి తర్వాత ప్రభాస్ చేస్తున్న సాహో సినిమాపై విపరీతమైన అంచనాలు నెలకొన్నాయి. ఈ క్రమంలో ఈ సినిమాకి సంబంధించిన కొన్ని వర్కింగ్ వీడియోలు పోస్టర్లు విడుదల చేసిన సినిమా ఇది తాజాగా జూన్ 13వ తారీఖున టీజర్ విడుదల చేస్తున్నట్లు ప్రకటించడంతో ప్రభాస్ అభిమానులు సాహో సినిమా టీజర్ కోసం ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు.


దీంతో చాలామంది ప్రభాస్ అభిమాని సాహో సినిమా టీజర్ ఎలా ఉంటుందోనని టెన్షన్ పడుతున్నారు. యాక్షన్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమాలో బాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన చాలామంది నటీనటులు నటించడం జరిగింది. హిందీ లో కూడా విడుదల కాబోతున్న నేపద్యంలో ఈ సినిమాపై బాలీవుడ్ ప్రేక్షకులు కూడా ఆసక్తి చూపిస్తున్నారు.


ఈ సినిమాలో ప్రభాస్ హీరోయిన్ శ్రద్ధ కపూర్ నటిస్తుంది. ఈ నేపథ్యంలో టీజర్ అప్ డేట్ ఇస్తూ యువి సంస్థ శ్రద్ధ కపూర్ మాత్రమే ఉన్న కొత్త పోస్టర్ ని విడుదల చేసింది. డార్లింగ్ లేకపోవడం కొంత నిరాశ పరిచినా టీజర్ ఎంతో దూరంలో లేదు కాబట్టి దాన్ని లైట్ తీసుకుంటున్నారు ఫాన్స్. ప్రభాస్ కెరీర్లోనే అత్యంత భారీ బడ్జెట్ తో తెరకెక్కింది సాహో. ఈ నేపథ్యంలో స్వాతంత్ర దినోత్సవం నాడు ఆగస్టు 15వ తారీఖున ఈ సినిమాని విడుదల చేయడానికి రెడీ అయ్యారు సాహో సినిమా యూనిట్.



మరింత సమాచారం తెలుసుకోండి: