పెళ్ళాం వూరెళితే మూవీలో సంగీత చేసిన నటనను ఎవరూ మరచిపోలేరు. అలాగే క్రిష్ణవంశీ మూవీ ఖడ్గం లో ఒక్క చాన్స్ ప్లీజ్ అంటూ ఆమె తెరపైన నటిగా వెలగాలని పడ్డ ఆశను చూసిన వారికీ అలా గుర్తుండిపోతుంది. నటిగా గ్లామర్ పాత్రలు ఎన్నో వేసిన సంగీత శివపుత్రుడు లాంటి మూవీలో డీ గ్లామర్ రోల్ కూడా ప్లే చేసి శభాష్ అనిపించుకుంది


తాజాగా ఓ షోలో ఆమె మాట్లాడిన కొన్ని మాటలు సంచలనం రేకెత్తించాయి. సినిమా పరిశ్రమలో ఉంటూ తాము ఇంటి వారి మీద పూర్తిగా ఆధారప‌డిపోతామని, వారు ఎస్ అంటే ఎస్ అన్నట్లుగా ఉంటామని చెప్పుకొచ్చింది. ఇది తనలాంటి ఎందరో తారల పరిస్థితి అంటూ సంగీత పేర్కొంది. తాను సినిమాల్లోకి వచ్చిన చాలా కాలం వరకు తన తల్లి సిట్ అంటే సిట్ అన్నట్లుగానే ఉండేదాన్ని అని, ఒకసారి ఇదేంటి అని అడిగితే మాత్రం అవతల వారు తట్టుకోలేరు అంటూ ఒక్కసారిగా తన తల్లి మీదనే హాట్ కామెంట్స్ చేసింది.


సినీ తారలు మమ్మీల చాటున ఉండి డమ్మీలుగా మారి మొత్తం కెరీర్లో తాము చాలా కోల్పోతున్నారని, ఎంత తల్లి అయినా మనం కూడా మెచ్యూర్డ్ గా ఆలొచన చేస్తేనే మనకంటూ ఏమైనా మిగిలివుంటుందని సంగీత చెప్పింది. మరి సంగీత జీవిత అనుభవాలు ఇప్పటి తరం తారలకు ఉపయోగపడతాయేమో చూడాలి.



మరింత సమాచారం తెలుసుకోండి: