తెలుగు లో ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసిన బాహుబలి, బాహుబలి 2 సినిమాలు జాతీయ స్థాయిలోనే కాదు ప్రపంచ స్థాయిలో ఎన్నో రికార్డులు క్రియేట్ చేసింది.  ఈ సినిమాలో నటించడం అంటే ఒక అదృష్టం చేసుకోవడమే అని ఎంతో మంది అంటారు.  అలాంటిది బాహుబలి పార్ట్ 1 లో రానా, ప్రభాస్ ఓ దొంగ కోసం వెళితే అక్కడ  వచ్చే ఐటమ్ సాంగ్ ‘మనోహరి’ సూపర్ హిట్ అయ్యింది.  


తాజాగా ఆ ఐటమ్ సాంగ్ లో నటించిన  నారా ఫతేహి తాజాగా బ్యాంకాక్ లో బట్టలు అమ్మడం అందరినీ షాక్ కి గురి చేసింది.   మోడలింగ్ రంగం నుంచి నటిగా మారిన నారా ఫతేహి పలు బాలీవుడ్ మూవీస్ లో ఐటమ్ సాంగ్స్ లో నటించింది. ఈ మద్య సల్మాన్ ఖాన్ నటించిన భారత్ సినిమాలో కూడా ఓ ఐటమ్ సాంగ్ లో నటించిన నారా ఫతేహి బ్యాంకాక్ లో బట్టలు అమ్మడం..అదీ స్థానిక భాషలో మాట్లాడుతూ కస్టమర్లను ఆకర్షించడం అందరినీ ఆశ్చర్యపరిచింది.  


ఈ భామ బ్యాంకాక్ మార్కెట్ లో నేల మీద కూర్చొని బట్టలు అమ్ముతోంది.  ఎలాంటి మేకప్ లేకుండా అచ్చం సేల్స్ గర్ల్ మాదిరిగానే ఉంది.  దీనికి సంబంధించిన వీడియో ఒకటి వైరల్ అవుతుంది.  ప్రస్తుతం ఈ బ్యూటీ 'స్ట్రీట్ డాన్సర్' అనే సినిమాలో నటిస్తోంది. వచ్చే ఏడాది జనవరిలో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. 


మరింత సమాచారం తెలుసుకోండి: