ఈ మద్య టిక్ టాక్ అంటూ ఓ విచిత్రమైన యాప్ వచ్చింది. ఈ టిక్ టాక్ తో చిన్న పేద్దా..ఆడా మగా అనే తేడా లేకుండా తమ చిత్ర విచిత్ర వేషాలు..డబుల్ మీనింగ్ డైలాగ్స్, బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ తో డ్యాన్స్ లు, వెర్రివేషాలు ఇలా ఒక్కటేమిటి కొన్ని నవ్విస్తే..కొన్ని అసహ్యం కలిగేలా ఉంటున్నాయి. అయితే ఈ మద్య టిక్ టాక్ యాప్ ని నిషేదించాలని కొన్ని వర్గాల వారు అంటుంటే..ఇదో ఫన్నీ యాప్ దీని వల్ల మీకేం నష్టం అని మరికొంత మంది అంటున్నారు. తాజాగా టిక్ టాక్ తో తనపై అసహ్యమైన ట్రోలింగ్ చేస్తున్నారని ఆవేదన చెందుతుంది ఎక్కడికి పోతావు చిన్నవాడ ఫేమ్ నందిత శ్వేతా.

ఈ మద్య తనకు సినిమాలు తగ్గిపోయాయని, సినిమాలు ఎందుకు చేయడం లేదంటూ టిక్ టాక్ లు చేస్తున్నారని అవి తనను బాగా ఇబ్బంది పెడుతున్నాయని చెప్పింది నందిత. సినిమాల్లో నటించనంత మాత్రాన ఖాళీగా ఉన్నట్లు కాదు కదా..ప్రస్తుతం తాను పై చదువుల కోసం కొంత గ్యాప్ తీసుకున్న మాట వాస్తవమే అని..అంత మాత్రాన టిక్ టాక్స్ చేయడం చాలా ఘోరమని చెప్పింది.

నటిగా అన్ని రకాల మూవీస్ లో నటించాలని, తను కూడా అదే చేస్తున్నట్లు తెలిపింది. తాను నటించి మొదటి సినిమా సక్సెస్ అవ్వడంతో తనకు అన్నీ హారర్ పాత్రలే వస్తున్నాయని, ఇప్పుడిప్పుడే ఆ జోనర్ నుండి బయటకొస్తున్నామని తెలిపింది. మంచి ప్రేమకథలు ఉంటే..నటనకు ఎక్కువ స్కోప్ ఉన్న పాత్రలు చేయాలని ఉందని నందిత శ్వేత అంటున్నారు. త్వరలోనే ఓ స్టార్ హీరో సరసన ఫుల్ లెంగ్త్ కమర్షియల్ సినిమా చేయబోతున్నట్లు ప్రకటించింది.

మరింత సమాచారం తెలుసుకోండి: