Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
TM
Thu, Jun 20, 2019 | Last Updated 1:19 pm IST

Menu &Sections

Search

స్టార్ హీరోల ఫేవరెట్ హీరోయిన్ అంత అడుగుతుందా ?

స్టార్ హీరోల ఫేవరెట్  హీరోయిన్ అంత అడుగుతుందా ?
స్టార్ హీరోల ఫేవరెట్ హీరోయిన్ అంత అడుగుతుందా ?
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
సినిమా అంటేనే కోట్లతో పని. ఇక సినిమా ఇండస్ట్రీలో హిట్ వస్తే.. కోట్లు అడుగుతారు. అయితే, హిట్  హీరోయిన్ ఏం అడిగినా  ఎన్ని కోట్లు అడిగినా అర్ధం ఉంది. కానీ పెద్దగా హిట్లు లేని హీరోయిన్ కూడా కోట్లు అడిగితే ఏమనుకోవాలి. వచ్చే అవకాశాలు కూడా రావు అనుకోవాలి. కానీ ఇక్కడ స్టార్ డమ్ లేని  ఈ క్రేజ్ హీరోయిన్ మాత్రం కోట్ల రూపాయిల భారీ మొత్తాన్ని  అడుగుతూ.. భారీ ఆఫర్స్ నే అందుకుంటుంది. ఇప్పటికే ఎన్టీఆర్, మహేష్ బాబుల సినిమాల్లో నటించింది. ప్రస్తుతం అల్లు అర్జున్, ప్రభాస్ లాంటి  స్టార్ హీరోల సినిమాల్లో  నటిస్తోంది. ఆ హీరోయినే  పూజా హెగ్డే. ప్రస్తుతం స్టార్ హీరోల ఫేవరెట్  హీరోయిన్ గా మారింది. 


అప్పుడెప్పుడో వచ్చిన   'ఒక లైలా కోసం' సినిమాతో తెలుగు సినిమాల్లోకి  ఎంట్రీ ఇచ్చింది పూజా హెగ్డే. ఆ చిత్రంతో నటన పరంగా పర్వాలేదనిపించింది కానీ, పూజ కెరీర్ కు మాత్రం ఆ చిత్రం పెద్దగా ఉపయోగపడలేదు. ఆ తరువాత 'ముకుంద'లో  నటించినా  అది పరాజయం అయింది. అయితే ఏం.. వరుసగా స్టార్ హీరోల సినిమాల్లో నటిస్తూ స్టార్ హీరోయిన్ అనిపించుకుంది. మిగిలిన హీరోయిన్స్ కు  అసూయ పుట్టేలా ఆఫర్స్ సంపాదిస్తోంది. పైగా భారీ మొత్తంలో డిమాండ్ చేస్తోందట. 


 అల్లు అర్జున్ హీరోగా త్రివిక్రమ్  దర్శకత్వంలో  తెరకెక్కుతున్న చిత్రంలో హీరోయిన్ గా నటిస్తోంది పూజా హెగ్డే.  ఈ సినిమాకి గానూ పూజ 2 కోట్ల పారితోషికం తీసుకుందట. అలాగే కొత్తగా ఒప్పుకుంటున్న సినిమాలకి కూడా అంతే ఇవ్వాలని ఆర్డర్స్ పాస్ చేస్తుందట.  ప్రభాస్ 20వ సినిమాలో నటిస్తుండటంతో పూజా డిమాండ్ కి ప్రొడ్యూసర్స్  ఒప్పుకుంటున్నారట. 



pooja
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
About the author

WORK LIKE A SERVANT AND LIVE LIKE A KING