హీరో హీరోయిన్లు అంటే చాలామందికి ఓ రకమైన అవినాభావ సంబంధం ఉంటుంది. అందులో కొందరైతే తమకు నచ్చిన నటుల కోసం ఏమైనా చేయడానికి సిద్దపడే హార్డ్ కొర్ ఫ్యాన్స్ ఉంటారు. అందులో కొందరు వారిని ఆరాధిస్తే... మరికొందరు వారిని గాఢంగా ప్రేమిస్తూ ఉంటారు. తాజాగా ఓ ప్రముఖ బాలీవుడ్ నటుడు పై ఇదే రకమైన ఫాన్స్ వార్ మొదలైంది.


అందులో కొందరు ఆ నటుడు అంటే ఇష్టపడుతుంటే... ఇంకొందరు పిచ్చి పిచ్చి కామెంట్స్ తో తెగ రెచ్చగొడుతున్నారు. ఆ నటుడు ఎవరో కాదు ప్రముఖ హిందీ నటుడు అర్జున్ మధూర్. ప్రస్తుతం ఈ నటుడు అంటే అమ్మాయిలే కాదు.... అబ్బాయిలు కూడా పడి చచ్చిపోతున్నారట. ది యాక్సిడెంటల్ ప్రైమ్ మినిష్టర్. ఈ సినిమాలో మన్మోహన్ సింగ్ పాత్రలో ప్రముఖ నటుడు అనుపమ్ ఖేర్ నటించగా... రాహుల్ గాంధీగా పాత్రలో అర్జున్ మాథూర్ నటించారు.


అయితే రాహుల్ పాత్రలో నటించిన అర్జున్ నటనకు మంచి గుర్తింపు లభించింది. అయితే ఆ సినిమా తర్వాత అర్జున్ మెడ్ ఇన్ హెవెన్ అనే వెబ్ సిరీస్ లోనటించాడు . ఇందులో అయన ఓ స్వలింగ సంపర్కుడి పాత్రలో అద్భుతంగా నటించాడు. అయితే ఆ పాత్రలో నటించిన అర్జున్ పై గే లు అంతా మనసుపడ్డారు.


అర్జున్ మధూర్ తామెలా ఓ గే అనుకోని చాలామంది అబ్బాయిలు కూడా ఆయనకు మెసేజ్ లు, ఫోన్ లు చేస్తూ ఇబ్బంది పెడుతున్నారు. కొందరైతే అతని చాలా అసభ్యకరమైన మెసేజ్ లు పెడుతున్నారని, మరికొందరు పెళ్లి చేసుకోవాలని అడుగుతున్నారని అర్జున్ వాపోతున్నాడు. తాను అటువంటి వాడిని కాదని చెప్పినా వారు వినడం లేదని....ఇలా ప్రతి రోజూ తనతో అసభ్య కరంగ ప్రవర్తిస్తూ టార్చర్ చేస్తున్నారని ఆయన చెప్పుకొచ్చారు. అయితే అందులో కొందరు మాత్రం తనను ప్రశంసిస్తూ, ఈ సిరీస్ విడుదలైన తరువాత తమలో ఆత్మవిశ్వాసం పెరిగిందని కొందరు స్వలింగ సంపర్కులు అన్నారని కూడా ఆయన చెప్పుకొచ్చాడు.


మరింత సమాచారం తెలుసుకోండి: