టాలీవుడ్ లో మన్మధుడు అనగానే గుర్తుకు వచ్చే హీరో అక్కినేని నాగార్జున.    త్రివిక్రమ్ రచనలో విజయ్ భాస్కర్ దర్శకత్వంలో రూపొందిన 2002 లో వచ్చిన రొమాంటిక్, ఎంట్రటైప్ మెంట్ సినిమా ‘మన్మధుడు’.  ఈ సినిమా నాగార్జునపై ఎంతగా ప్రభావం పడిందంటే..టాలీవుడ్ లో ఆయనను అందరూ మన్మధుడు అని పిలిచే స్థాయికి చేరుకుంది.  ఈ సినిమాలో నాగార్జున భగ్న ప్రేమికుడిగా, కోపిస్టి ఆఫీసర్ గా కనిపిస్తాడు.  బ్రహ్మానందం- నాగ్ ల మద్య వచ్చే సన్నివేశాలు పొట్ట చెక్కలయ్యేలా ఉంటాయి. 

ఈ సినిమా హిట్ తర్వాత వెంటనే సీక్వెల్ తీయాలనుకున్నా అది కుదరలేదు. చాలా సంవత్సరాల గ్యాప్ తర్వాత మన్మధుడు2 సీక్వెల్ రూపొందుతుంది.  మొదట్లో మన్మధుడు సినిమాలో  నాగచైతన్య, అఖిల్‌లలో ఎవరో ఒకరు రెండో మన్మధుడుగా కనిపిస్తారా?  అనుకున్నారు..కానీ మరోసారి నాగార్జున్ మన్మధుడిగా కనిపించబోతున్నారు..అందుకు తగ్గట్టు ఆయన ఫిట్ నేస్ ఉన్నారు.  ఈ సినిమాలో నాగ్ సరసన అందాల భామ రకూల్ ప్రీత్ సింగ్ నటిస్తుంది.  మన్మథుడు 2 మూడీ టీజర్ ఈ రోజు మధ్యాహ్నం రిలీజ్ అవుతుంది.

పేకాటలోని కింగ్ కార్డుపై నాగార్జున యానిమేషన్ లుక్ ని డిజైన్ చేశారు. కార్డు పైభాగంలో నాగార్జున కాఫీ తాగుతున్నట్లు ఉండగా, తలక్రిందులుగా వైన్ తాగుతున్నట్లు నాగ్ లుక్ ఆకట్టుకుంటోంది.  'ది కింగ్ ఈజ్ నౌ ది కింగ్ ఆఫ్ హార్ట్స్' అనే క్యాప్షన్ అంటూ ఈ సినిమా దర్శకుడు ట్విట్ చేశారు.  ప్రస్తుతం ఈ చిత్ర షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. సమంత కూడా ఈ మూవీలో చిన్న కామియో రోల్ పోషిస్తోంది.  


మరింత సమాచారం తెలుసుకోండి: