టాలీవుడ్ లో ఎంతో మంది హీరోల వారసులు హీరోలుగా వెండి తెరకు పరిచయం అయ్యారు.  కానీ అతి కొద్ది మందికి మాత్రమే సక్సెస్ వరించింది..లాంటి వారిలో నందమూరి బాలకృష్ణ, అక్కినేని నాగార్జున, మెగాస్టార్ చిరంజీవి కుటుంబం నుంచి వచ్చిన పవన్ కళ్యాన్, అల్లు అర్జున్, రాంచరణ్ లు మాత్రం ఇప్పుడు టాప్ హీరో లీస్టులో ఉన్నారు.  అయితే ఒకప్పుడు విలన్ గా నటించి తర్వాత రెబల్ స్టార్ గా పేరు తెచ్చుకున్న కృష్ణం రాజు వారసుడిగా ‘ఈశ్వర్’సినిమాతో వెండి తెరకు పరిచయం అయ్యాడు ప్రభాస్. 


మొదటి సినిమా ‘ఈశ్వర్’పక్కా మాస్..ఇందులో ప్రభాస్ లుకింగ్ కూడా మాస్ గానే ఉంటుంది. అయితే ఈ సినిమా ప్రభాస్ కి పెద్దగా పేరు తీసుకు రాలేదు..తర్వా కొన్ని సినిమాలు వచ్చినా ప్రభాస్ హీరోగా నిలదొక్కుకోలేక పోయారు.  కృష్ణం రాజు నట వారసుడిగా మాత్రమే అప్పటి వరకు ఈదుకూంట వచ్చాడు.  ఇక రాజమౌళి తీసిన ‘చత్రపతి’సినిమా ప్రభాస్ స్టార్ డమ్ ఒక్కసారే మార్చేసింది. ప్రభాస్ పర్సనాలిటీకి పక్కాసూట్ అయిన సినిమా ‘చత్రపతి’.  ఈ సినిమా ఘన విజయం సాధించడం తో అందరి చూపు ప్రభాస్ పై పడింది. 


ఆ తర్వాత ‘మిర్చి’లాంటి ఫ్యాక్షన్ తరహా సినిమాలో తానేంటో మరోసారి నిరూపించుకున్నాడు.  అప్పటి వరకు టాలీవుడ్ టాప్ హీరో ప్రభాస్ అని మాత్రమే పేరు ఉంది.  ఇక రాజమౌళి తీసిన ప్రతిష్టాత్మక మూవీ ‘బాహుబలి, బాహుబలి2’.  ఈ సినిమాల కోసం ఏ హీరో చేయని త్యాగం ప్రభాస్ చేశారు..తన పెళ్లి విషయం కూడా పక్కకు పెట్టి ఎంతో డెడికేషన్ తో సినిమా పూర్తి చేశారు.  కష్టపడితో ఫలితం తప్పకుండా ఉంటుందని ప్రభాస్ పట్ల బాగా రుజువైంది.  బాహుబలి లాంటి సినిమాతో ఏకంగా జాతీయ స్థాయిలో గొప్ప పేరు ప్రఖ్యాతలు సంపాదించారు.  ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా ఇండియన్ బాహుబలి అంటే వెంటనే ప్రభాస్ నే గుర్తు చేసుకుంటారు. 


అలా తన నటప పట్ల ఉన్న అంకిత భావం ఆయన పెద్దనాన్న కృష్ణం రాజుకే గర్వకారణం అయ్యింది.  ఎన్నో సందర్భాల్లో నా వారసుడు ప్రభాస్ అని చెప్పుకోవడం కాదు..ప్రభాస్ పెద్ద నాన్న కృష్ణం రాజు అని చెప్పుకోవడానికి నేను ఎంతో గర్వపడుతున్నానని..తన కష్టం..డెడికేషన్ వల్లే  ఇంత తక్కువ వయసులో జాతీయ స్థాయి నటుడు గా పేరు తెచ్చుకున్నారని గర్వంగా చెప్పారు. తాజాగా ప్రభాస్ హీరోగా దర్శకుడు సుజీత్ రూపొందిస్తోన్న హైవోల్టేజ్ యాక్షన్ డ్రామా 'సాహో'. బాహుబలి 2 తర్వాత చాలా గ్యాప్ తీసుకొని ఆడియన్స్ కి మరో థ్రిల్ చూపించడానికి సిద్దమవుతున్నాడు ప్రభాస్.  టీజర్ తోనే చిత్ర యూనిట్ కళ్ళు చెదిరేలా విజువల్స్ ని క్రియేట్ చేసింది.


సినిమా కోసం ఏడుగురు ప్రముఖ యాక్షన్ కోరియేగ్రాఫర్స్ వర్క్ చేశారు. హెల్ బాయ్ - రష్ హావర్ వంటి సినిమాలకు పని చేసిన పెంగ్ జహాంగ్ అలాగే ట్రాన్స్ ఫార్మర్స్ సినిమాల యాక్షన్ సీక్వెన్స్ కి వర్క్ చేసిన కెన్నీ బెట్స్ సరికొత్త తరహాలో హాలీవుడ్ రేంజ్ లో ఫైట్స్ ను రూపొందించినట్లు అర్ధమవుతోంది. ఏదేమైనా దర్శకుడు సుజీత్ ఇంత పెద్ద సినిమాకు కెప్టెన్ గా ఉండి అనుభవం గల స్టార్ యాక్షన్ మాస్టర్స్ తో వర్క్ చేయించాడు. ప్రభాస్ నుంచి ఆడియన్స్ ఏం కోరుకుంటున్నారో..అది కళ్లకు కట్టినట్లు చూపించారు చిత్ర యూనిట్. ఈ టీజర్ అప్పుడే రికార్డులు క్రియేట్ చేసే దిశగా సాగుతుంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: