టాలీవుడ్ ఇండస్ట్రీలో కమెడియన్ గా సునీల్ మంచి టైమింగ్ లో ఉన్న సమయంలో హీరో అంటూ సినిమాలు చేసి చేతులు కాల్చుకున్నారు. మొదటిలో రెండు మూడు విజయాలు వచ్చినా కానీ తర్వాత హీరోగా చేసిన సినిమాలు ఫ్లాప్ అయిన నేపథ్యంలో చాలామంది కమెడియన్ సునీల్ ని ప్రేమించిన వాళ్లు అనవసరంగా రాంగ్ స్టెప్ వేశారు అని కామెంట్ చేశారు.


దీంతో సునీల్ కూడా అభిమానుల అభిరుచులను తెలుసుకొని మళ్లీ క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా యూ టర్న్ తీసుకున్నారు. ఇటీవల చాలా కామెడీ పాత్రల్లో కూడా నటించాడు. ఇటువంటి నేపథ్యంలో సునీల్ మరోసారి ఎక్స్పరిమెంట్ చేయడానికి రెడీ అవుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. గత ఏడాది బాలీవుడ్ లో విడుదలై ఘనవిజయం సాధించిన 'అంధాధున్' చిత్రంపై సునీల్ కన్నేశాడట.


ఆయుష్మాన్ ఖురానా ప్రధాన పాత్రలో నటించిన ఈ చిత్రం మంచి విజయాన్ని అందుకుంది. ఈ చిత్రంలో ఆయుష్మాన్ అంధుడిగా నటించాడు. ఆ పాత్రలో సునీల్ నటించబోతున్నాడనే ప్రచారం జరుగుతోంది. హీరోగా మార్కెట్ పూర్తిగా పడిపోయిన సమయంలో అంధాధున్ చిత్రం సునీల్ కు ఏమేరకు కలసి వస్తుందో చూడాలి.


మరింత సమాచారం తెలుసుకోండి: