సాహో సినిమాను చాలా గ్రాండ్ గా తీశారు. అయితే ఇప్పటికే ఈ సినిమాను ఓకే పెద్ద సినిమా కంటే రెండు మూడు రేట్లు ఎక్కువ పెట్టి కొన్నారు. నిజంగా ప్రభాస్ కు ఎంత మర్కెట్ ఉన్నదనేది ఇక్కడ పెద్ద ప్రశ్న. బాహుబలి తర్వాత ప్రభాస్‌ది ఏ రేంజ్‌ అనే దానిపై ఎవరికీ క్లారిటీ లేదు. బిజినెస్‌ వర్గాలు కూడా అతడి స్టామినాని సరిగ్గా అంచనా వేయలేకపోతున్నాయి. బాహుబలితో ప్రభాస్‌ స్థాయి నిజంగా నూట యాభై కోట్లకి చేరిందా లేక బాహుబలి వల్ల ఆమాత్రం వచ్చి వుండదా అనుకుంటున్నారా అనేది ఇంకా తెలియదు.


ప్రభాస్‌కి ఇప్పుడు ఎంత సీన్‌ వుందనేది తెలియకపోయినా కానీ సాహో చిత్రంపై బ్లయిండ్‌గా బెట్‌ వేస్తున్నారు. ఈ చిత్రానికి సీడెడ్‌లో పాతిక కోట్లు చెల్లించారంటే నమ్మకాలు ఏ స్థాయిలో వున్నాయో అర్థం చేసుకోవచ్చు. ఈస్ట్‌, వెస్ట్‌ గోదావరి జిల్లాల్లో ఇరవై కోట్లు, కర్నాటకలో ఇరవై ఏడు కోట్లు వచ్చాయట. మామూలుగా పెద్ద సినిమాలు అమ్మే రేట్లకి ఇది దాదాపు రెండు రెట్లు ఎక్కువ. నిజంగా సాహో క్లిక్‌ అయితే ఈ డబ్బులు రాబట్టడం అంత కష్టమేం కాదు.


పొరపాట్న తేడా వస్తే అప్పుడు పరిస్థితి ఏమిటి?ఎంత పెద్ద స్టార్‌ నటించిన సినిమాకి అయినా ఇప్పుడు యావరేజ్‌ టాక్‌ వచ్చినా వంద కోట్ల వసూళ్లు రావడం లేదు. మరి ప్రభాస్‌ ఎలాంటి టాక్‌ వచ్చినా బయ్యర్లని ఒడ్డెక్కిస్తాడా? ఇంతలేసి రేట్లు పెట్టి కొంటోన్న డిస్ట్రిబ్యూటర్ల నుంచి థర్డ్‌ పార్టీల వాళ్లు ఇంకా ఎక్కువ ఇచ్చి రైట్స్‌ తీసుకుంటారా? ప్రస్తుతానికి సాహో సినిమా వ్యాపారంలో వున్న వారందరికీ రూలెట్‌ టేబుల్‌లా కనిపిస్తోంది. నంబర్‌ పడితే జాక్‌పాటే కానీ తేడా కొడితే మాత్రం మటాషే

మరింత సమాచారం తెలుసుకోండి: