అల్లు అర్జున్ త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఈ షెడ్యూల్‌లో బన్నీతో పాటు పూజా హెగ్డే, సుశాంత్, నవదీప్, రాహుల్ రామకృష్ణ తదితరులు పాల్గొంటున్న కీలకమైన సన్నివేశాలను షూట్ చేస్తున్నారు. ఇక ఈ సెట్‌లో సీనియర్ హీరోయిన్ టబు త్వరలో జాయిన్ కాబోతున్నట్టు సమాచారం. జూన్ 21 నుంచి ఆవిడ బ్యాగ్డ్రాప్‌లో సీన్స్ ని తెరకెక్కించబోతున్నారట. టబు ఈ సినిమాలో బన్నీకి తల్లిగా మలయాళ నటుడు జయరాం తండ్రిగా నటిస్తారని ఇంతకు ముందే ఒక న్యూస్ వచ్చిన సంగతి తెలిసిందే. 


బాలకృష్ణతో పాండురంగడు సినిమాలో నటించిన టబు ఆ తర్వాత  నటిస్తున్న తెలుగు స్ట్రెయిట్ మూవీ ఇదే. ఆ మధ్య కొంచెం గ్యాప్ ఇచ్చినప్పటికి తిరిగి గత ఏడాది అందాదున్ సినిమాతో బాలీవుడ్ సెకండ్ ఇన్నింగ్స్ ని గ్రాండ్ గా మొదలుపెట్టిన టబు బాలీవుడ్‌లో రీసెంట్‌గా వచ్చిన దే దే ప్యార్ దే తో కూడా మరో కమర్షియల్ సక్సెస్‌ను తన ఖాతాలో వేసుకుంది.  


వెంకటేష్ తో తీయబోయే ఈ రీమేక్ లో కూడా అదే పాత్ర తనకే ఆఫర్ చేశారు. ఇప్పుడు అల్లు అర్జున్ లో చాలా ముఖ్యమైన పాత్ర కాబట్టే ఒప్పుకున్నారని లేటెస్ట్ న్యూస్. వచ్చే సంక్రాంతికి విడుదల ప్లాన్ చేసిన బన్నీ-త్రివిక్రమ్ ల మూవీ టైటిల్ దసరాకు రివీల్ చేసే అవకాశాలు ఉన్నాయి. తమన్ మ్యూజిక్ అందిస్తున్న ఈ సినిమాకి ఇప్పటికే ట్యూన్స్ కంపోజ్ చేయడం పూర్తయ్యిందని ఇన్ సైడ్ టాక్. 



మరింత సమాచారం తెలుసుకోండి: