లీడర్ తో హీరోగానే కెరీర్ మొదలుపెట్టినా బాహుబలిలో చేసిన విలన్ రోల్ భల్లాలదేవాతోనే ఎక్కువ పేరు ప్రఖ్యాతులు సంపాదించుకున్న రానా ఇటు టాలీవుడ్‌తో పాటు అటు బాలీవుడ్‌లోను మంచి నటుడిగా కొనసాగుతున్నాడు. అంతేకాదు మరో వైపు నాన్న అడుగుజాడల్లో నిర్మాతగా తన ప్రత్యేకతను చూపించుకోవడానికి ప్లాన్ చేసుకుంటున్నాడు. సురేష్ ప్రొడక్షన్స్ అంటే ఒక హిస్టరీ. ఆ హిస్టరీని బ్రేక్ చేయకుండా సినిమాలను నిర్మించడం అంత ఈజీ కాదు. ఇప్పుడు రానా కూడా బ్యానర్ కి ఎలాంటి మచ్చ రాకుండా ప్లాన్ చేస్తున్నాడు.  


కేరాఫ్ కంచెరపాలెం సినిమా నుంచి రానా చిన్న సినిమాల మీద పెట్టుబడులకు ఆసక్తికరంగా ఉన్నాడు. సురేష్ బాబు కూడా పెళ్లి చూపులు నుంచి ఫలక్ నుమా దాస్ సినిమా దాకా ఇదే స్ట్రాటజీ ఫాలో అయ్యారు. ఇటీవలే సురేష్ బాబు ఇప్పటి నుంచి సురేష్ సంస్థ మీదే వేరే సినిమాలు ఉండవని వాటి కోసం ఇంకో కొత్త బ్యానర్ ను పెడతామని చెప్పిన సంగతి తెలిసిందే.


ఇక్కడ సురేష్ బాబు చెప్పింది రానా మనసులో ఉన్నది ఒకటే అనిపిస్తోంది. వెంకీ మామ తర్వాత దీనికి సంబంధించిన క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. రానా వేణు ఊడుగుల దర్శకత్వంలో విరాటపర్వంతో పాటు గుణశేఖర్ హిరణ్యకశిప కోసం రెడీ అవుతున్నాడు. నిర్మాణంలో ఉన్న హాథీ మేరె సాతి ఈ ఏడాదిలోనే విడుదలకు రెడీ కానుంది. 
 


మరింత సమాచారం తెలుసుకోండి: