మెగాస్టార్ చిరంజేవి నటిస్తున్న 151 వ చిత్రం సైరా నరసింహ రెడ్డి ఇప్పటికే చిత్రీకరణను పూర్తిచేసుకుంది. పిడ్ స్పీడుతో పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు మొదలుపెట్టారు. `బాహుబలి` తరువాత ఆ స్పాన్ లో వస్తున్న సినిమా కావడం - ఇందులో బిగ్ బీ నటించడం వంటి కారణాలతో సినిమాపై దేశ వ్యాప్తంగా అంచనాలు నెలకొన్నాయి. అందుకు తగ్గట్లే రిలీజ్ ప్లాన్ చేస్తున్నారు. ఈ సినిమా కోసం గాంధీ జయంతి అయిన అక్టోబర్ 2ను లాక్ చేశారు.


అదే రోజు భారీ స్థాయిలో చిత్రాన్ని ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేయాలని హీరో రామ్ చరణ్ ప్లాన్ మొదలుపెట్టాడు. స్వాతంత్య్ర సమరయోధుడు ఉయ్యాల వాడ నరసింహారెడ్డి జీవిత కథ ఆధారంగా దేశ భక్తి - తెలుగు వీరుడు వీర పరాక్రమాల నేపథ్యంలో అత్యంత భారీగా దేశ భక్తిని ప్రబోదిస్తూ ఈచ ఈ చిత్రాన్ని తెరకెక్కించారు.


ఇలాంటి చిత్ర విడుదలకు దేశానికి స్వాతంత్య్రం తీసుకొచ్చిన గాంధీజీ జయంతి అయిన అక్టోబర్ 2 కరెక్ట్ గా వుంటుందని డిసైడ్ అయిన చిత్ర బృందం ఈ చిత్ర విడుదల కోసం ఈ తేదీనే లాక్ చేసేశారని తెలిసింది.`సైరా` ఫస్ట్ లుక్ టీజర్ ని గత ఏడాది విడుదల చేసిన చిత్ర యూనిట్  థియేట్రికల్ ట్రైలర్ విడుదల కోపం ప్లాన్ చేస్తోంది. ఆగస్టు 22న మెగాస్టార్ చిరంజీవి పుట్టిన రోజు రాబోతోంది. అదే రోజు మెగా అభిమానులకు మెగా గిఫ్ట్ ఇవ్వడానికి థియేట్రికల్ ట్రైలర్ ని సిద్ధం చేస్తున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: