నందమూరి ఫ్యామిలీ నుంచి బాలకృష్ణ తర్వాత ఆ స్థాయి మాస్ ఫాలోయింగ్ సంపాదించాడు జూ. ఎన్టీఆర్.   బాలనటుడిగా వెండి తెరకు పరిచయం అయిన ఎన్టీఆర్ తర్వాత ‘నిన్ను చూడాలని’సినిమాతో హీరోగా మారారు.  ఈ సినిమా పెద్దగా పేరు తీసుకు రాలేదు.  దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన ‘స్టూడెంట్ నెం.1’ సినిమాతో ఎన్టీఆర్ ని మంచి నటుడిగా గుర్తించేలా చేశాయి. 

ఆ తర్వాత సుబ్బు అట్టర్ ఫ్లాప్.. వివివినాయక్ దర్శకత్వంలో ‘ఆది’బ్లాక్ బస్టర్ అయ్యింది.  కృష్ణవంశి తీసిన రాఖీ సినిమా సమయంలో ఎన్టీఆర్ చాలా బొద్దుగా ఉండటంతో విమర్శలు వచ్చాయి.  ఇక రాజమౌళి తీసిన ‘యమదొంగ’సినిమాలో ఎన్టీఆర్ అందరికీ షాక్ ఇస్తూ కరెంట్ తీగలా మారిపోయాడు.  అప్పటి నుంచి తన ఫిజిక్ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. 

ఎన్టీఆర్ ది పెద్దలు కుదిర్చిన వివాహం..భార్యపేరు ప్రణిత. ఎన్టీఆర్ కి మొదటి సంతానం అబ్బాయి..పేరు అభిరామ్.  గత ఏడాది మరో బాబు పుట్టాడు..పేరు భార్గవ్.  నేడు ఎన్టీఆర్ చిన్న కుమారుడు భార్గవ్ పుట్టినరోజు.. ఈ సందర్భంగా తారక్ ఇన్ స్టా గ్రామ్ లో స్పందించాడు. భార్గవ్ కు అప్పుడే ఏడాది వయసు వచ్చేసిందా.. అంటూ తన చిన్నారి ఫోటోను ఇన్ స్టాగ్రామ్ ఖాతాలో పోస్ట్ చేశారు.

దాంతో నందమూరి అభిమానులు చిన్నారి భార్గవ్ కి పుట్టినరోజు శుభాకాంక్షలు చెబుతున్నారు. ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్, రాంచరణ్ మల్టీ స్టారర్ మూవీ ‘ఆర్ఆర్ఆర్’ తెరకెక్కుతుంది.  2020 జూలై 30న ఈ సినిమా విడుదలకు నిర్మాతలు సన్నాహాలు చేసుకుంటున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: